Welcome to the BLISSFUL journey

Day 17 – తల్లి చేసిన మేలు

0
నాగతేజ, ఒక విధమైన శంకతో చెట్టు దగ్గరికి చేరారట. ఆయనకు కలిగిన అనుభూతిని వివరిస్తూ…
“అమ్మగారు చెట్ల వద్దకు అందర్ని పంపే ముందు ఒక్కొక్కర్ని ఒక్కో చెట్టు వద్దకు వెళ్లమన్నారు కదా! అందరికీ తమకంటూ ఒక చెట్టు ఉంది, మరి నాకెందుకు ప్రత్యేకంగా ఒక చెట్టు లభించలేదు? నాకు ఇందుకు అర్హత లేదా?… అంటూ నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి” అని చెప్పుకొచ్చారు తేజ. అమ్మగారి ఆజ్ఞ మేరకు తేజ ఇదివరకే వేరొకరు ఉన్న చెట్టు వద్దకు వెళ్ళి, అక్కడ భావంతో తన కర్మలు స్వీకరించమని చెట్టును ప్రార్ధించినపుడు, ఒక్కసారిగా తన కాళ్ళ క్రింద భూమి అదృశ్యమైనట్లు తన శరీరం తెలియని అలౌకిక సీమలను చేరుతున్నట్లు భావం కలిగిందట. రాకెట్ వేగంతో తాను ఎక్కడికో దూసుకొని వెళిపోతున్నట్లు   అనిపించిందిట. తన భ్రూ మధ్యానికి, చెట్టుకు మధ్య ఒక సూక్ష్మమైన నాడి వంటిది ఏర్పడి చెట్టుతో తనకు ఒక బంధనాన్ని ఏర్పరిచిందిట. ఆ నాడి ద్వారా తనలో నుంచి ఎదో వెళిపోతున్నట్లుగా, అద్భుతమైన ప్రకంపనలు కలిగిస్తూ గురువులు జరిపించిన అద్భుత ప్రక్రియ తనలో జరిగిందట. జన్మ జన్మలుగా అజ్ఞానాంధకారం కారణంగా తాను ఆర్జించిన కర్మలు, తాను అనుభవించాల్సిన దుష్కర్మల ప్రభావాన్ని స్వీకరించేందుకు అంగికరించినా  ఆ మాతృ వృక్షాన్ని చూసి భావార్ద్రతతో ఏడవసాగారు నాగతేజ. ప్రక్రియ అయిపోయి అందరూ మళ్ళీ ధ్యానం లో కూర్చున్నాక కూడా తేజాకు బాహ్య స్పృహ కలుగ లేదట. ఆ చెట్టు వద్దే అలా అలౌకికానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయారు. మాలో ఒకరు వెళ్లి ఆయనను పిలుచుకొని వచ్చి, తిరిగి ధ్యానంలో అమ్మగారి సమక్షంలో కూర్చోబెట్టారు.
Share.
Leave A Reply