Welcome to the BLISSFUL journey

Day 2 – అమ్మగారితో హిమాలయ యాత్రకు దివ్యావకాశం

0

“గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా” అన్న మాటలు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి అక్షరాలా వర్తిస్తాయి. అమ్మగారిని బాహ్య చక్షువులతో కాక జ్ఞాన చక్షువులతో దర్శించిన వారికి మాహా యోగ శక్తి ద్వారా స్వర్ణమయమై,అంతటా వ్యాపించిన అమ్మగారి దివ్య స్వరూపం దర్శనమిస్తుంది. అమ్మగారి ఆ రూపాన్ని దర్శించటానికి చాలా యోగ శక్తి కావాలి. అయితే సాధకులు ఎవరైనా, భక్తితత్పరత, పరిపూర్ణ గురు భావం, ప్రేమ ద్వారా మాత్రమే అమ్మగారి తత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. అమ్మగారు మహా సిద్ధులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారితో సమానంగా విశ్వ కార్యాన్ని నిర్వర్తిస్తూ, సుషుమ్న క్రియా యోగ పరివ్యాప్తికి ఉచితంగా ప్రపంచమంతటా దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఫౌండర్ గా ‘పరిపూర్ణ ఆరోగ్యం’, ‘ఆనందమయ జీవనం’ గురించి విశేష అవగాహన కల్పిస్తూ, ఉచిత శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

2015లో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు శాస్త్ర వేత్తల కోసం హైదరాబాద్ DRDOలో ధ్యాన దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమ్మగారు అందించిన దీక్ష ద్వారా ఎంతో మంది శాస్త్రవేత్తలు లబ్ధి పొందారు. దీంతో 2016లో అమ్మగారి ధ్యాన కార్యక్రమాన్ని ముస్సోరీలో కూడా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని తలిచారు DRDO డైరెక్టర్ శ్రీ శంకర్ కిషోర్ గారు. అమ్మగారు ముస్సోరీకి విచ్చేసి మరింత మంది శాస్త్రవేత్తలకు దీక్షను ప్రసాదించాలని శంకర్ కిషోర్ గారు కోరటంతో, అమ్మగారు వారి విన్నపాన్ని మన్నించి, తప్పక వస్తానని హామీ ఇచ్చారు అమ్మగారు. అమ్మగారితో పాటుగా శిష్యులందరూ ప్రయాణించేందుకు అవకాశం లేకపోవటంతో పరిమిత సంఖ్యలోనే అక్కడ కార్యక్రమ నిర్వహణకు సుషుమ్న క్రియా యొగులని తీసుకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కార్యక్రమాల నిర్వహణకు కొంత మేర, ఆంగ్ల, హిందీ భాషలు తెలిసిన క్రియా యొగులని ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసిన వారిలో మాకు కూడా అవకాశం రావటం ఎన్నో జన్మల పుణ్య ఫలం. అమ్మగారి వంటి మహా గురువు గారితో ‘హిమాలయ యాత్ర’ మా జీవితాల్లో ఎన్నో మధుర స్మృతుల్ని, మరెన్నో ఆధ్యాత్మిక విలువల్ని, జీవిత పాఠాల్ని అందించింది. హిమాలయ యాత్ర విశేషాలను ఈ పవిత్ర దినాల్లో చదివిన వారికి అమ్మగారితో యాత్ర చేసిన దివ్యానుభూతిని తప్పక కలుగ చేస్తుంది

B
Share.
Leave A Reply