Welcome to the BLISSFUL journey

Day 44 – బాబాజీ గారు ఎలా ఉంటారో తెలియ చేసిన అమ్మగారు

0

మన పరమ గురువులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు మనకు ధ్యానంలో కనిపించే బాబాజీ గారి లాగే ఉన్నారు. గౌరి శంకర్ పీఠంలో తులసి మొక్కలు ఉన్నాయి. ఆ తులసి మొక్కలకు ఉన్న దళాలు మామూలు వాటి కంటే మూడింతలు పెద్దవిగా ఉన్నాయి. గౌరి శంకర్ పీఠమంతా తులసీ దళ సురభిళం వ్యాపించి ఉంటుంది. శిఖరానికి ఎడమ భాగంలో 12 చిన్న గుహలు ఉన్నాయి. బాబాజీ గారి 49 శిష్యుల్లో 12 మంది ఆడవారు. ఆడవారు లేత కాషాయం రంగు దుస్తులు ధరించారు. మగవారు గోధుమ రంగు వస్త్రాలు ధరించారు. గౌరి శంకర్ పీఠంలో శిష్యులెవ్వ రూ మాట్లాడుకోవటం లేదు. కేవలం కళ్ళ ద్వారా మాత్రమే సందేశాలు పంపించుకుంటున్నారు. వారికి మౌనమే వ్యాఖ్య. అక్కడ శిఖరం నుండి ప్రవహించే జలపాతం వేడినీళ్ల కుండంలా ఉంది. జలపాతం నుండి ప్రవహిస్తున్న నీరు తిరిగి కిందకు వెళ్లిపోతున్నాయి. ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి . అక్కడ చిన్న చిన్న పూలు, పసుపు, తెలుపు వర్ణాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఎడమ వైపు కూడా అగ్ని కుండం ఉంది. ఇక్కడ మనకి కేవలం తెల్లవారు ఝామున మాత్రమే పక్షుల కిల కిల రావాలు వినిపిస్తాయి. అక్కడ గౌరి శంకర్ పీఠంలో రోజంతా పక్షుల కిలకిలలు వినపడుతూనే ఉంటాయి. అలాగే జలపాతపు ధ్వని నిరంతరం వినిపిస్తుంటుంది. కొద్దిగా దూరంగా ఒక తామర కొలనులో నీలి రంగు తామరలు ఉన్నాయి …

Share.
Leave A Reply