Day 5 – హిమాలయ యాత్రకు శుభారంభం

0

మా హిమాలయ యాత్ర ప్రారంభమైందిప్రయాణం ఆరంభం నుండే సత్ సంగం ఆరంభించాంఒక్కొక్కరుఅమ్మగారి వద్ద దీక్ష తీసుకున్నాక వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను గురించి చెప్పుకొచ్చారు.హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఇంచు మించు 3 గంటల పాటు సాగిన మా ప్రయాణం 3 నిమిషాల్లా సత్ సంగంతో ఎంతో సాఫీగా సాగిపోయిందిఢిల్లీలో 1 గంట సేపు ఆగిన విమానం డెహ్రాడూన్పయనమయ్యేందుకు నింగికి ఎగసిందిఢిల్లీ నుండి డెహ్రాడున్కు కేవలం గంట మాత్రమే ప్రయాణంమా ప్రయాణాంతరం డెహ్రాడూన్ చేరాంఅక్కడ వాతావరణం శీతలంగా ఉంటుందేమో అనుకున్నాం కానీకొద్దిగా వేడిగానే అనిపించింది అక్కడి వాతావరణం.మరో పక్క లగేజీతో ఎయిర్పోర్ట్ బయటకి వచ్చాముఅక్కడ వాహనాలు అప్పటికే సిద్ధంగా ఉన్నాయిఇతర నగరాల నుండి వస్తోన్న మరి కొంత మందినిఅదే వాహనాల్లోకి ఎక్కించుకొని ముస్సోరీకి బయలుదేరాం.  ఇన్నోవాల్లో మా ప్రయాణం ప్రారంభమైందిఆధునికంగా కనిపించే రహదారులతోచక్కటి పచ్చికతో చాలా బాగుంది  ప్రదేశంమహా నగరాల్లోరోడ్లలాగా కాక కొద్దిగా సన్నగా ఉన్నాయక్కడ రోడ్లుఅలా ముందుకు సాగాక ఎత్తైన పర్వతం ఒకటి కనిపించింది పర్వతపు శిఖరాగ్రం దట్టంగా కప్పబడిన మబ్బుల వల్ల కనపడటం లేదు. “ పర్వతం పైకేమన ప్రయాణం” అన్నాడు డ్రైవర్రయ్యి మంటూ దూసుకు పోతోంది మా కారుమంచి హస్తలాఘవంగా స్టీరింగ్ తిప్పుతున్నాడు డ్రైవర్దట్టమైనపొడవైన చెట్ల నడుమ నుండి పైకి సాగిపోతున్నాందారిఅంతా మెలికలేపర్వతం పైకి కారు వెళుతోన్న కొద్దీచెవుల్లో చలి గాలికి గుయ్యిమంటూ చప్పుడుచలి కూడా పెరుగుతూ వచ్చింది పర్వతం పైకి సాగేకొద్దీఅక్కడ నిర్మించిన అందమైన ఇళ్లుకొన్నికట్టడాలుపర్వతం పై నిర్మితమైన చిన్న గ్రామాలు దర్శనమిచ్చాయి.

Share.

Leave A Reply