Welcome to the BLISSFUL journey

పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత

0
Kartika pournami 2019 celebrations at shantiniketan, Kolkata


సూర్యుడు మరియు చంద్రుడు అనే వివిధ ప్రకాశవంతమైన శక్తుల ప్రతి ఛాయతో పాటు ఈ విశ్వము మనను జీవిత మార్గంలో సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. సూర్యుడు మన దేహాన్ని, చంద్రుడు మన ఆత్మను సూచిస్తాయి.  సూర్యుని ద్వారా కాంతి మరియు స్పష్టత ఏర్పడుతుంది అదేవిధంగా చంద్రుని ద్వారా  చీకటి ఘడియలను మనము గమనిస్తాము . చంద్రుడు  ప్రతి నెల ఏ విధంగా అయితే దశలవారీగా మార్పు చెందుతాడో మానవులు కూడా చంద్రుని వలె దశలవారీగా మార్పు చెందుతారు. 

చంద్రుడు భూమి చుట్టూ తన కక్ష్యలో సూర్యుడికి నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు పౌర్ణమి అని పిలువబడుతుంది .  పౌర్ణమి రోజు, ప్రశాంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సుసంపన్నత కోసం ఈ పౌర్ణమి సృష్టించబడింది. మన పూర్వీకుల సంప్రదాయం ప్రకారం ఈ రోజున  సాధన  ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తుంది, పూర్ణ చంద్రుడు లేదా పౌర్ణమి అనేక ఆధ్యాత్మిక విషయాలకు ప్రతీకగా ఉంటుంది. పౌర్ణమి అనేది దైవిక స్త్రీతత్వాన్ని సూచించడమే కాకుండా ఆధ్యాత్మికతలో  పౌర్ణమి జ్ఞానోదయానికి సంబంధించినదిగా ఉంటుంది. తుదకు చంద్రుడు మనపై ప్రకాశిస్తూనే చీకటిని ప్రకాశింపజేస్తారు.


దాదాపు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందారు. గౌతమ సిద్ధార్థ బుద్ధుడు దృఢ సంకల్పంతో ప్రసిద్ధి చెందిన బోధి వృక్షం క్రింద ధ్యానంలో కూర్చున్నారు ‘”నాకు జ్ఞానోదయం జరిగితే తప్ప ఇక్కడ నుండి కదలను. నేను జ్ఞానోదయమైన వ్యక్తిగా ఉదయిస్తాను లేదా ఇక్కడే మరణిస్తాను”. గౌతముడు తన ధ్యానం ద్వారా ప్రపంచంపై శాశ్వతమైన ముద్ర వేసారు. అతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రపంచంలో ఎంతో మార్పును తీసుకు వచ్చారు, అతను జ్ఞానోదయాన్ని కోరుకునే మనిషి యొక్క ఆకాంక్షలో భిన్నమైన గుణాన్ని తీసుకువచ్చారు. 

మానవులపై పౌర్ణమి ప్రభావాలు


పౌర్ణమి భూమిపై మరియు ప్రతి జీవిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది.ఇది అలల శక్తిని నియంత్రిస్తుంది. అదేవిధంగా పౌర్ణమి నాడు మానవ శరీరంలో ఉండే  ద్రవాలు ప్రభావితమవుతాయి, ఎందుకంటే చంద్రుడు శరీర ద్రవాలను ఆకర్షిస్తాడు మరియు మన శరీరంలో 75% నీరు కలిగి ఉంటుంది ఇది మానవులు మరియు జంతువుల భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను మరింత ప్రభావితం చేస్తుంది. ఇది అంతర్ దృష్టి మరియు సుప్తచేతనావస్థను నియంత్రిస్తుంది. 

విష్ణు పురాణం వంటి ప్రాచీన భారతీయ గ్రంథాలు చంద్రుని యొక్క మూలం గురించి తెలియజేస్తున్నాయి. ఈ పురాణం ప్రకారము, చంద్రుడు క్షీర సముద్రము నుండి మృదువైన మరియు మంచు కిరణాలతో ఉద్భవించారు.

మనము తీసుకునే ఆహారము రెండు భాగాలుగా విభజించబడుతుంది  – మనస్సు మరియు ప్రాణము. మనస్సు యొక్క శక్తి పీనియల్ గ్రంథి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది, దీని నుండి ముఖ్యమైన హార్మోన్లు స్రవిస్తాయి. రాత్రి నుండి మనం మేల్కొనే వరకు మన కార్యకలాపాలన్నింటినీ నియంత్రించడానికి చంద్రుడు ఈ గ్రంథిలోకి ప్రవేశిస్తాడు. ప్రాణము లేదా ప్రాణశక్తి ప్రకంపనల కారణంగా మరొక విధంగా ప్రవహిస్తుంది.ఈ ప్రకంపనలు వలన మనలో శక్తి యొక్క పెరుగుదల ఉంటుంది,ఈ సమయము సంపూర్ణ శరణాగతి మరియు ధ్యానము చేయుటకు అనుకూలంగా ఉంటుంది. చంద్రుని కిరణాలు మానవులు, జంతువులు, మొక్కలు, జలము మరియు ప్రతీ జాతిని ప్రభావితం చేస్తాయి. పౌర్ణమి ధ్యానము ఆధ్యాత్మిక అన్వేషకులకు అంతర్లీనంగా ప్రయాణించడానికి , మనస్సును అధిగమించడానికి మరియు మనలో నిక్షిప్తమై ఉన్న దైవత్వాన్ని అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. పౌర్ణమి మనస్సు యొక్క కార్యాచరణను పెంచుతుంది, చేతన ఆలోచనలను విస్తరింపజేస్తూ ,ఉప-చేతనైన వాటిని చేతనావస్థ లోకి  ప్రయాణింపజేస్తుంది .పౌర్ణమి సమయంలో ధ్యానము చేయడము వల్ల మన అంతర్గత జ్ఞానంతో మరియు ప్రకృతితో కనెక్ట్ అయ్యే అవకాశము ఉంటుంది. మన వ్యవస్థలో ఈ అధిక శక్తి భావం పౌర్ణమి రోజున సహజంగా వస్తుంది. ఈ రోజున మనము శక్తి మరియు జాగ్రృతి  అనుభవంలోకి వస్తుంది. పౌర్ణమికి మన కనెక్షన్ ఎంత బలంగా ఉంటే, మన హృదయ చక్రము అంత సక్రమంగా ఉంటుంది. మన హృదయ చక్రము ప్రేమ, కరుణ, సానుభూతి మరియు క్షమాపణకు నిలయం. ప్రతికూలతను వీడేందుకు పౌర్ణమి సరైన సమయం అని దీని అర్థం. పౌర్ణమి అమావాస్యకు దారితీసినట్లుగా, ఈ విధంగా మనం కొత్త అధ్యాయానికి సిద్ధమవుతాము.

పౌర్ణమి యొక్క ప్రయోజనాలను మానవులు ఎలా పొందగలరు ?


మన పరమ గురువులు మరియు శ్రీ ఆత్మానందమయి అమ్మగారు మనము శరీరము కంటే చాలా గొప్పవారమని, మన నిజమైన నేను “ఆత్మ” అని గుర్తు చేస్తున్నారు. ఆత్మ అనేది శరీరాన్ని ఉత్తేజపరిచే శక్తి. మన నిజస్వరూపాన్ని అనుభవించడానికి సుషుమ్న క్రియా యోగా ధ్యానము యొక్క జ్ఞానాన్ని వారు మనకు అందించారు . ఇది మేధోపరమైన అన్వేషణ కాదు, ధ్యానము ద్వారా మనం మన నిజమైన తత్వాన్ని  అనుభవించవచ్చు. 


అమ్మగారు ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా సుషుమ్న క్రియా యోగులు బ్రహ్మ మూహూర్థంలో ధ్యానం చేయాలని మరియు పౌర్ణమి నాడు సాయం సంధ్యలో ఈ సహజ దృగ్విషయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. చంద్రుని యొక్క కాంతి కింద కూర్చుని ధ్యానము చేయడానికి ఇది సరైన సమయము.  రోజు, వారం, గత నెలలో మీరు ఎలా ఉన్నారు అనేది ఆత్మపరిశీలన చేసుకోండి .ఈ సమయంలో భవిష్యత్తు కోసం లక్ష్యాలను సంకల్పించుకోండి ఎందుకంటే ఇది లక్ష్యాలను సాధించుకోవడానికి శక్తివంతమైన సమయం. మనం ధ్యానంలో ఆసీనులైనప్పుడు, మన “ఆత్మ”ను అనుభూతి చెందుతాము.మనము “ఆత్మ” స్వరూపము అని అర్థం అవగానే , అన్నింటినీ మన ఆధ్యాత్మిక అవగాహన ద్వారా  గ్రహించడం ప్రారంభిస్తాము. మనము శరీరము మరియు మనస్సు కంటే ఎక్కువ అని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము, మనమందరము ఆధ్యాత్మిక బహుమతులతో నిండిన ఆత్మ.  ప్రేమ, కరుణ, శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తాము. మన కోసం సరికొత్త ప్రపంచము తెరుచుకుంటుంది, కాబట్టి ధ్యానములో అంతర్లీనంగా  వెళ్లి అంతర్గతంగా ఉన్న చంద్రుడిని కనుగొనండి. మేము మరింత ఆధ్యాత్మిక మరియు ఆత్మీయమైన జీవితాన్ని గడపడానికి, సహాయము చేయడానికి పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని పండిస్తాము. 

మార్చిలో పౌర్ణమి

మార్చి నెలలో పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి, ఇది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఫాల్గుణ పౌర్ణమి హోలాష్టక్ ముగింపు మరియు రెండు రోజుల హోలీ పండుగను  సూచిస్తుంది. గౌర పౌర్ణమి (చైతన్య మహాప్రభు జయంతి) మరియు హోలీ లేదా హోలికా దహనం ఈ రోజునే జరుపుకుంటారు. ఫాల్గుణ/ఫాల్గుణ పౌర్ణమి రోజున, విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించారు మరియు హోలికా అనే రాక్షసిని బూడిదగా చేశారు, ఇది చెడుపై విజయాన్ని సూచిస్తుంది. హోలికా దహనం చేసిన మరుసటి రోజు రంగుల పండుగ హోలీగా జరుపుకుంటారు, ఇది జీవితంలోని అన్ని భావోద్వేగాలను సూచిస్తుంది మరియు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ద్వారా సానుకూల సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. దీనిని “హుటాసని ఫాగున్ సుద్ పూనమ్” అని కూడా అంటారు.

ఫాల్గుణ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత

ఈ ప్రత్యేక రోజున, వివిధ ప్రదేశాలలో, ప్రజలు సమృద్ధి మరియు సంపదల దేవత అయిన లక్ష్మీ దేవి జన్మదినమైన లక్ష్మీ జయంతిని కూడా పాటిస్తారు. విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించి, చంద్రుడిని ధ్యానించే వారు దైవిక ఆశీర్వాదాలు మరియు అదృష్టాన్ని పొందుతారు.

ఫాల్గుణ పౌర్ణమి ఆచారాలు

ఫాల్గుణ పౌర్ణమి రోజున, ప్రజలు తెల్లవారుజామున నిద్రలేచి,  నదులలో లేదా వారి ఇళ్లలో పవిత్ర స్నానమాచరించి, లక్ష్మీ దేవి మరియు శ్రీమహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరుతూ ధ్యానము చేస్తారు, ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైనది.

ఇప్పటినుండి మీరు రాత్రిపూట ఆకాశము వైపు చూస్తే, చంద్రుడు ఏ దశలో ఉన్నాడో గమనించండి మరియు ధ్యానము ద్వారా చంద్రుడి శక్తి మీ రోజువారీ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తుందో గుర్తుతెచ్చుకోండి.

Share.

Comments are closed.