Welcome to the BLISSFUL journey

శివరాత్రి ఉపవాసం

0

శివరాత్రి ఉత్సవాల్లో “ఉపవాసము” లేదా “వ్రతం” అనేది ఒక అసమానమైన అంశం. ఈ ఉపవాసం అనేది  రోజంతా పాటిస్తూ శుభ సమయం వచ్చేవరకు ఆహారానికి దూరంగా  ఉండడం . శివరాత్రి (శివుడికి అంకితం చేయబడిన రాత్రి) నాడు పాటించే వ్రతం చాలా ముఖ్యమైనది.

ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాము. “ఉపవాసము” కోసం ఉపయోగించే పదం “ఉప” & “వాసం” అనే రెండు పదాలతో రూపొందించబడింది. “ఉప” అనే పదానికి “దగ్గరగా” అని & “వాసం” అంటే “నివసించుట” అని, అంటే “ఉపవాసం” అనే పదానికి “దగ్గరలో నివసించడం” అని అర్ధం వస్తుంది. ఇప్పుడు ప్రశ్న “ఎవరికి సమీపంలో నివసిస్తున్నారు లేదా దేనికి సమీపంలో నివసిస్తున్నారు ?” దీనికి వివరణ దైవానికి సమీపంలో నివసిస్తున్నాము అని అర్థం.అంటే ఒకరి దృష్టి లేదా ఎరుక దైవంపై ఉంటే ఆ వ్యక్తి “ఉపవాసం”లో ఉన్నట్లుగా పరిగణింపబడతారు.

ప్రతి మనిషి యొక్క జీవాత్మ (వ్యక్తిగత ఆత్మ) ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి ఒకరి దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత యొక్క మార్గాన్ని అనుసరించడం సవాలుగా ఉంది కాబట్టి, ప్రతీ సుషుమ్న క్రియా యోగి తన మనస్సును ఏకాగ్రతలో ఉంచడానికి  అతడు /ఆమె పై కొన్ని పరిమితులను పాటించాలి లేదా విధించుకోవాలి. ఉపవాసం అనేది అటువంటి నిగ్రహం.

వ్యాధికి ప్రధాన కారణమైన టాక్సిన్ పదార్థాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఉపవాసం సహాయపడుతుందని ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. ఆటోఫాగిపై నోబెల్ బహుమతి పొందిన జపనీస్ శాస్త్రవేత్త డాక్టర్. యోషినోరి ఓహుసుమీ ఉపవాసం ఏ విధంగా దెబ్బతిన్న / చనిపోయిన కణాలను నశింపజేసి మరియు శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుతుందో తెలియజేశారు.

అయితే మనం ఉపవాసాన్ని రుచి యొక్క స్వచ్ఛంద నిగ్రహానికి మాత్రమే పరిమితం చేయకూడదు.  ఉపవాసం అనగా అర్థం ఏమిటంటే, ఒకరు భౌతిక ప్రపంచం నుండి “ఉపసంహరణ” లేదా “ఉపవాసం” కలిగి ఉండి  దైవిక ఆనందంలో “విందు” చేస్తారు. దీని అర్థం మనం తినేవాటిని మాత్రమే కాకుండా మనం చూసేవి, గమనించేవి ,వినేవి మొదలైన వాటిపై కూడా ఎరుక కలిగి ఉండడం.

ఇప్పడు మనందరమూ అసలైన ‘వ్రతం’ లేదా ‘ఉపవాసం’ ఆచరిద్దాం.

Share.

Comments are closed.