శ్రీదేవి దేవిరెడ్డి అనుభవాలు

0

“నాకే ఎందుకు ఇలా జరగాలి? Why me?” అన్నది ప్రతి ఒక్కరికీ మనస్సును తొలిచేసే ప్రశ్నే …కానీ,ఈ బాధ వలన చాలా పెద్దగా రావలసిన సమస్యలు ఈ రూపంలో వచ్చి కర్మ విచ్ఛేదనము చేస్తున్నాయి – ఇది గురువుల అనుగ్రహము – అని చాలా శాస్త్రాలు చెప్పవచ్చు.కానీ అదేమిటో అనుభవములోకి తీసుకురాగలిగింది కేవలము సుషుమ్న క్రియా యోగము మాత్రమే…కూకట్ పల్లి ( హైదరాబాద్)లో వుండే శ్రీదేవి గారు ఉన్న ఇద్దరు పిల్లలలో ఒక “ఆటిజం” ఉన్న పాపతో నరకయాతన పడేవారు…నాకే ఎందుకు ఇలా జరిగింది? అన్న దుఃఖము, పని ఎక్కువై అలుపు,ఖర్చుల వల్ల ఆర్థిక ఒత్తిడి – అటువంటి స్థితిలో 2014 లో డాక్టర్ మధుశ్రీ గారి వద్ద నుంచి సుషుమ్న క్రియా యోగములోకి అడుగు పెట్టారు.ధ్యానము ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమ్మగారి క్లాసెస్ హాజరైనప్పుడు తనకు ఎందుకు ఈ బాధ కలిగింది? తల్లి తండ్రుల కర్మలు బాలన్స్ కావటానికి మనతో అధికంగా సేవ చేయించుకొని పిల్లలు పుడతారు, వాళ్లకు ప్రేమతో మనము సేవ చెయ్యడం వలన మన ఋణము తీరిపోతుంది.ఇది మనము తప్పకుండా నిర్వర్తించాల్సిన కర్మ – అని అవగాహన వచ్చి శ్రీదేవి గారికి తన జీవితము గురించి గొప్ప క్లారిటీ వచ్చింది.ఎది ఏమైనా ఈ జన్మకు నేను ఈ ఋణము నుంచి బైటపడతాను – నేను చేసుకున్నదే కదా నేను అనుభవిస్తున్నాను …అని మనస్సు సమాధాన పరుచుకుని శ్రద్ధగా ,పద్ధతిగా,విసుగు, కోపం లేకుండా పనులు పూర్తి చేసుకోవడానికి అలవాటు పడ్డారు…అప్పట్లో ఆవిడ కోరిక ఒకటే…పాపకు వైద్యం చేయించి,హాయిగా ఉంచగల వసతి ఉండాలి..ఆశ్చర్యంగా ధ్యానము చెయ్యగా చెయ్యగా ,వారి భర్తకు అంతకు ముందు ఎన్నో సార్లు ప్రయత్నించినా రాని H 1 వీసా వచ్చి అమెరికా వెళ్లారు… టైం కు మెడిటేషన్స్ కు రావడము , పౌర్ణమి మెడిటేషన్స్ కు వారి అమ్మగారిని పాప దగ్గర ఉంచి గ్రూప్ మెడిటేషన్స్ లో పాల్గొనడము,వీలున్నప్పుడల్లా ఇతరులకు ధ్యానం నేర్పించడం , ప్రతీ పని ఉత్సాహంగా చెయ్యడము ,కొత్త ఉత్సాహము – ఇవన్నీ మెడిటేషన్ చేస్తున్న కొద్ది శ్రీదేవిగారిలో వచ్చిన గొప్ప మార్పులు…
సుషుమ్న క్రియా యోగములో కేవలము 49 నిమిషాల ధ్యానము ఎన్ని అంచలంచెలలో ఆరోగ్యం ,మానసిక ఎదుగుదల ,ఫైనాన్షియల్ స్టెబిలిటీ ,ఎనర్జీ ,జీవితం పట్ల కర్మ సిద్ధాంతము ఎంత గొప్పగా పని చేస్తుందో అర్థం చేసుకోగలగడము – ఇవన్నీ శ్రీదేవి అనుభవించి పంచుకున్న విశేషాలు.అందుకే గురువుల పఠం దగ్గర నిలబడి, కళ్లు మూసుకుని నమస్కారం చేసుకుంటూ వారి పాదాల వద్ద తను చిన్న పరమాణువుగా ఊహించుకోగలిగిన స్థిరత్వము ఏర్పడింది శ్రీదేవి గారికి.

Share.

About Author

Comments are closed.