Day: January 26, 2019

ఓంకారాలు ప్రారంభించగానే దేహ స్పృహ లేదు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో ధ్యానంలో లీనమయ్యాం. కాసేపటి తర్వాత అమ్మగారు ఓకే చెప్పారు. నెమ్మదిగా అందరం కళ్ళు తెరిచాం. కొందరికికొన్ని అనుభవాలు కలిగాయి. అవి విన్నాక అమ్మగారు, ధ్యానం చేసిన మనందరి సూక్ష్మ శరీరాలు బద్రీనాథకు వెళ్లాయన్నారు. నిజానికి హిమాలయ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోబద్రీనాథకు కూడా వెళ్లాలనుకున్నాం, కానీ తర్వాత ఎందుకనో మరొక సారి వెళదామని తీర్మానించారట అమ్మగారు. అటువంటిది ఆ రోజు గురువు దయవల్ల, అంతటి మహిమ గల ప్రదేశానికి సూక్ష్మంగావెళ్ళిరా గలగటం ఆత్మానందాన్ని కలిగించింది. మధుశ్రీ గారికి ధ్యానం లో గరుడ పక్షి దర్శనమిచ్చిందని చెప్పారు. శ్రీ మహా విష్ణువు క్షేత్రమైన బద్రీనాథకు వెళ్లి వచ్చినట్లు, అమ్మగారు చెప్పిన మాటలకుసంకేతంగానే గరుడ పక్షిని ధ్యానంలో దర్శించారు మధుశ్రీ గారు. చాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిన ఆ నాటి ధ్యానం ఇప్పటికీ మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. శంకర్ కిషోర్ గారికిఅభినందనలు తెలియచేసి, అక్కడి నుండి రూములకు బయలుదేరాం. మరుసటి నాడు ఉదయం డెహ్రాడూన్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే లేవాలి కాబ్బటి మరుసటి నాడుకి కావాల్సినసన్నాహాలు చేసుకొని నిదురించాం.