Welcome to the BLISSFUL journey

49 రోజుల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలన విధానం – వారం 3

0

దివ్య ఔషధ గుణాలున్న అనేక పదార్థాలను, క్రియలను మీకు ఈ వారం అందిస్తున్నాం. పంచభూతాల అసమతౌల్యం వల్ల కలిగే అనేక దోషాలను నివారించటానికి,ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యల నివారణకు ఈ క్రియలను తప్పక పాటించండి.

  • నిమ్మ ఆకులు – నిమ్మ ఆకును ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వంట పదార్థంగా వినియోగిస్తారు. నిమ్మ ఆకులను వికారానికి, తలనొప్పి, ప్రయాణాల్లో నీరసం, ఆస్తమా వంటి సమస్యల నివారణకు వినియోగిస్తారు. కంటి నిండా నిద్ర పట్టటానికి, నిమ్మ ఆకులు మంచివి. నిమ్మ ఆకుల ప్రాశస్త్యం మన పురాణాల్లో కూడా చెప్పబడింది. నిమ్మ ఆకులో ఔషధ విలువలు మీకు ఎంతో ఉపకరిస్తాయి.
  • నిమ్మరసం – దాహార్తిని తీర్చి వేడిమి నుంచి హాయిని కలిగిస్తుంది నిమ్మరసం. విశుద్ధ, అనాహత చక్రాలలో కలిగే దోషాలను నివారించగలదు. గుండెలో, గొంతులో పేరుకున్న కఫాన్ని, నోటికి సంబంధించిన ఆరోగ్యానికి అవసరమైంది నిమ్మరసం. చర్మంలో లోపించిన ఛాయను తిరిగి పొందేందుకు నిమ్మరసం మంచిది. ఉపవాస సమయాలలో నిమ్మరసాన్ని తీసుకోవటం అందరికి తెలిసిందే.
  • అల్లం అల్లం విశ్వానికే ఔషధంగా చెప్పబడింది. అల్లం మణిపూరంలో ఉన్న దోషాలను తగ్గించి శరీరంలో బద్దకాన్ని తగ్గించి ఉత్సాహం కలిగిస్తుంది అల్లం. మరెన్నో అద్భుతమైన గుణాలున్న దివ్య ఔషధం అల్లం.

Day 15

Day 16

Day 17

Day 18

Day 19

Day 20 

Day 21

 

 

Share.
Leave A Reply