Welcome to the BLISSFUL journey

అత్యంత పవిత్రమైన మాసం

0

కార్తీక / కార్తీక్ హిందూ క్యాలెండర్ లో ఎనిమిదవ చంద్రమాసం . హిందువులకు ఈ కార్తీక మాసం పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది . కార్తీక మాసమంతా పరమేశ్వరున్ని మరియు శ్రీమహావిష్ణువును అపారమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దీనినే “పురుషోత్తమ మాసం” అని కూడా అంటారు. ఈ మాసము అక్టోబర్ మరియు నవంబర్ మధ్య కాలంలో వ్యాప్తి చెంది ఉంటుంది. శివునికి మరియు విష్ణువుకు ఈ కార్తీకమాసము అత్యంత  ప్రీతికరమైన మాసం గా చెబుతారు.

ఈ పవిత్ర కార్తీక మాసంలో 15 వ రోజు ” శుక్లపక్షము లేదా పౌర్ణమిని  కార్తీక పౌర్ణమిగా చెప్పబడుతుంది. కార్తీక అనేది కార్తికేయ దేవుడు నుండి సంగ్రహించబడిన ప్రసిద్ధ భారతీయ నామం ఇతడు శివుని యొక్క కుమారుడు అనగా ” ధైర్యాన్ని ప్రసాదించేవాడు”
కృత్తిక అనే నక్షత్రం నుండి ” కార్తీక మాసం” ఉద్భవించింది.
దీపావళితో ప్రారంభమైన ఈ మాసం కార్తీక అమావాస్యతో పూర్తవుతుంది. దీనినే త్రిపుర పూర్ణిమ మరియు త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. కార్తీక త్రిపుర పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ  “త్రిపురారి” ( శివుని యొక్క మరొక నామం) నుండి ఉద్భవించింది.  అనగా త్రిపురాసుర లేదా తారకాసురులు అనే అసురులను ( విద్యున్మాలి, తారకాక్ష మరియు వీర్యవన ) వధించారు అని అర్థం

కార్తీక పౌర్ణమి పవిత్రత వెనుక పురాణం

తారక అనే అసురుడను కార్తికేయుడు వధించాడు. తారకాసురుడి యొక్క ముగ్గురు పుత్రులు తారకాసురులు లేదా  త్రిపురాసుర బ్రహ్మదేవుని కొరకు కఠోర తపస్సు చేసి, త్రిపురి అని నామధేయం గల మూడు నగరాల్లో 1000 సంవత్సరాలు జీవించి వారిని అగ్నితో కూడిన బాణంతో మాత్రమే తాము సంహరించ బడాలి.. అనే వరాన్ని పొందారు. 1000 సంవత్సరాల ప్రతికూల పరిపాలన ముగిసిన తరువాత దేవతలందరూ ఈ ముగ్గురు అసురులను వధించమని ప్రార్థించారు. పరమశివుడు రుద్రతాండవం ( శివుని యొక్క న్రృత్యం భూమి కంపించే విధంగా మరియు విధ్వంసం సృష్టించే విధంగా ఉంటుంది) ను ఆరంభించారు. ఈ రుద్రతాండవం త్రిపురిని కదిలించింది . శివుని బాణం ముగ్గురు అసురుల గుండా దూసుకు వెళుతూ ,శివుని యొక్క మూడవ నేత్రం నుండి వచ్చిన అగ్ని త్రిపురిని దహించి వేసింది.

త్రిపురాసురుల సంహారం మరియు వారి నగరాలను శివుడు నాశనం చేయడంతో దేవతలు సంతోషించారు వారు ఆ రోజున  దేదీప్యమానమైన పండుగగా ప్రకటించారు ఈ రోజును దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు.

శివునికి అంకితమైన పండుగలలో కార్తీక పౌర్ణమి మాత్రమే,మహా శివరాత్రి తరువాత ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున మత్స్య జన్మదినం కూడా ఇది విష్ణువు యొక్క పది అవతారాలలో మొదటిది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు మనువును, మహా ప్రళయం నుండి రక్షించడానికి మత్స్య ( చేప) లేదా మత్స్యావతారంగా అవతరించారు.

ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రపంచాన్ని గొప్ప వరద నుండి రక్షించారు. అందులో మొట్టమొదటి వ్యక్తి మను . పెద్ద పరిమాణంలో పెరిగిన చిన్న చేపను పట్టుకున్నాడు. వరద తనను సమీపిస్తున్న సమయంలో మను తన పడవను చేప తల పై ఉన్న కొమ్ముకు కట్టి తనను తాను రక్షించుకున్నాడు.

పండుగలు

కార్తీక పౌర్ణమి కూడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అనేక ఆచారాలు మరియు పండుగలు కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తాయి. ప్రబోధిని ఏకాదశి రోజున కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కార్తీక మాసంలో పదకొండవ రోజు ఏకాదశి మరియు పదిహేనవ రోజు పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ ప్రబోధిని ఏకాదశి చాతుర్మాస్ ముగింపును సూచిస్తుంది, ఇది విష్ణువు నిద్రిస్తున్నాడని నమ్మే నాలుగు నెలల కాలం. ప్రబోధిని ఏకాదశి భగవంతుని మేల్కొలుపును సూచిస్తుంది. పంఢరపూర్ మరియు పుష్కర్ లలో ప్రబోధిని ఏకాదశి వేడుకలు చాలా ప్రసిద్ధి చెందాయి.

ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమయ్యే తులసి-వివాహం కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది. పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి మధ్య ఏదైనా అనువైన రోజున తులసి వివాహాన్ని నిర్వహించవచ్చు. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు కార్తీక పౌర్ణమి రోజును తులసి దేవి (తులసి) మరియు శ్రీ మహా విష్ణువు యొక్క ప్రాతినిధ్యమైన సాలిగ్రామముకు వివాహ ఆచారాలను నిర్వహించడానికి ఎంచుకుంటారు. తులసి వివాహం భారతదేశంలో వర్షాకాలం ముగింపు మరియు వివాహ కాలము ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఈ పండుగ కృత్తిక నక్షత్రంలో(చంద్ర క్యాలెండర్) వచ్చినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. దీనినే మహా కార్తీక అని అంటారు.
కార్తీక పౌర్ణమి రోజు శ్రీ గురునానక్ జన్మ దినం. ఈ రోజున సిక్కులు ఎంతో భక్తితో ఉత్సవము జరుపుకుంటారు.

కార్తీక పౌర్ణమి మాసంలో జరుపుకునే ఆచారాలు

హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజున, దేవతలు భూమిపైకి వచ్చి పవిత్ర నదులలోకి దిగుతారు. అందుకే, కార్తీక పౌర్ణమి సందర్భంగా, భక్తులు పవిత్ర నదులలో స్నానం చేసి, దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు.
కార్తీక మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు గంగానదిలో మరియు ఇతర పవిత్ర నదులలో ప్రజలు పవిత్ర స్నానం చేస్తారు. కార్తీక మాసంలో పవిత్ర స్నానాలు చేసే ఆచారం శరద్ పౌర్ణమి రోజున ప్రారంభమై కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ పవిత్ర స్నానాన్ని “కార్తీక స్నానం” లేదా “నదీ స్నాన” అని పిలుస్తారు.

పుష్కర్ వద్ద లేదా గంగా నదిలో, ముఖ్యంగా వారణాసిలో కార్తీక స్నానం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి వారణాసిలో గంగానది స్నానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన రోజు, భక్తులు సాయంత్రం చంద్రోదయ సమయంలో  స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు .ప్రజలు కూడా శివుడికి పూజలు చేసి ఆ రోజంతా ఉపవాసం పాటిస్తారు. శివునికి పాలు మరియు తేనెతో స్నానం చేయించడం ద్వారా రుద్రాభిషేకం చేసే సంప్రదాయం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి” సత్య నారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. గ్రంధాల ప్రకారం, కార్తీక పౌర్ణమి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజులలో ఒకటి, కాబట్టి కొంతమంది భక్తులు కార్తీక పౌర్ణమి నాడు సత్య నారాయణ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

కార్తీక దీపోత్సవం

కార్తీక దీపం భారతదేశంలో జరుపుకునే అత్యంత పురాతనమైన పండుగలలో ఒకటి, ఇది దీపాల పండుగకు ప్రతీక మరియు చిరు దీపావళి అంటే చిరు లేదా చిన్న దీపావళి అని పిలుస్తారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో కార్తీక పౌర్ణమి నాడు, 365 వత్తులతో కూడిన పెద్ద దీపాన్ని వెలిగించి, అశుభాలను పారద్రోలి, పవిత్రమైన కార్తీక పురాణాన్ని పారాయణం చేసి మంగళప్రదమైన శుభాలను ఆహ్వానిస్తారు. శివ, విష్ణు ఆలయాలు దీపాలతో అలంకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలోని మహిళలు అరటి కాండం లేదా అరటి ఆకులో వెలిగించిన దీపాలను ఉంచి, నదిలో లేదా ఇంట్లో ఉన్న  ఒక పళ్ళెంలో నీటిలో తేలుతూ ఉంచే సంప్రదాయాన్ని అనుసరిస్తారు.

వారణాసిలో, ఘాట్‌లు వేలాది దిపాలతో (ప్రకాశవంతంగా వెలిగించిన మట్టి దీపాలు) సజీవంగా ప్రకాశిస్తాయి. నూనె/నెయ్యి దీపాలు వెలిగించి  ఇళ్ళలో మరియు శివ,విష్ణు దేవాలయాలలో రాత్రంతా ఉంచుతారు. ఈ రోజును “కార్తీక దీపరత్నం” అని కూడా అంటారు. నదులలోని చిన్న పడవలలో కూడా లైట్లు తేలుతూ ఉంటాయి.దీపం మన శరీరాన్ని సూచిస్తుంది మరియు కాంతి మన ఆత్మను సూచిస్తుంది. మనం దీపం వెలిగించినప్పుడు, మన మనస్సును శుభ్రపరుచుకుంటాము మరియు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం మరియు పగ వంటి అన్ని పేరుకుపోయిన ప్రతికూలతల నుండి విముక్తి పొందుతాము.

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్‌ కార్తీక పౌర్ణమి వేడుక

కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి – (నవంబర్) నవంబర్ 18న వస్తుంది, మన  సుషుమ్నా క్రియా యోగా ఫౌండేషన్‌లో అందరికీ ఈ రోజు చాలా పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది

ఈ రోజు మన పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ భోగనాథ్ సిద్ధార్ గారు మరియు శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గార్ల జన్మదినము. పరమ గురువులు శ్రీ శ్రీ  శ్రీ భోగ నాధ సిద్ధార్థ్ గారు మరియు శ్రీశ్రీశ్రీ మహావతార్ బాబాజీ గారు సుషుమ్న క్రియా యోగ అనే అత్యున్నతమైన ధ్యాన ప్రక్రియను పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి 7 సెప్టెంబర్ 2005 వినాయక చతుర్థి శుభ సందర్భంగా బ్రహ్మ ముహూర్త సమయంలో అందించడం జరిగింది. మన గురువుల జన్మదినం సుషుమ్న క్రియా యోగులకు వారి ఆశీర్వాదాలను పొందేందుకు మరియు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ పవిత్రమైన పర్వదినమును 18 నవంబర్ 2021న ఒక ప్రత్యేకమైన వేడుక ద్వారా స్మరించుకుందాం.

ఈ దివ్యమైన కార్తీక మాసాన్ని పవిత్రతో మరియు భక్తితో జరుపుకుందాం. పరమశివుడు , విష్ణువు మరియు మన పరమగురువులందరి అనుగ్రహాన్ని మరియు ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుదాం.

Share.

Comments are closed.