Welcome to the BLISSFUL journey

అనిర్భన్ పాల్ అనుభవాలు

0

అనిర్ బన్ వృత్తి రీత్యా ఒక ఐ టీ ఉద్యోగి. సుషుమ్న క్రియా యోగ దీక్షను 14 నవంబర్ 2014 లో, హైదరాబాద్ కోటిదీపోత్సవంలో ప్రశాంతమ్మగారి ద్వారా స్వీకరించారు. ఆయన ఎంతో కాలంగా అల్సరేటివ్ కొలైటిస్ అనే రుగ్మతితో బాధపడుతూ ఉండేవారు. అల్సరేటివ్ కొలైటిస్ పెద్ద పేగు,రెక్టం (పురీష నాళిక)కు సంబంధించిన ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ సమస్య ఉన్న వారికి కోలన్ క్యాన్సర్ కూడా రావచ్చు. అల్సరేటివ్ కొలైటిస్ కారణంగా పెద్ద పేగు,రెక్టం లోపల భాగమంతా అల్సర్లు బాగా వ్యాపించటంతో విపరీతమైన మంట ఉంటుంది, రక్త విరోచనాలు కావటం, భరించలేని కడుపు నొప్పి రావటం, కండరాలు పట్టినట్లుగా ఉండటం, దీర్ఘ శంకకు వెళ్లాలని నిరంతరం అనిపించటం వంటి లక్షణాలు ఉంటాయి. నిజానికి ఈ సమస్య ఉన్న వారికి జీవనం నరకప్రాయంగా ఉంటుంది. రక్త విరోచనాల వల్ల శరీరంలో సత్తువ నశించి , శరీర పుష్ఠి కొరవడి బరువు కూడా బాగా తగ్గుతారు. శరీరంలో అధికంగా రక్తం తగ్గిపోవటం జరిగితే రక్త మార్పిడి సైతం చేయాల్సి వస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్ బారిన పడిన వారిని పూర్తిగా నయం చేయటం సాదయం కాదు. ఈ వ్యాధి, వ్యాధిగ్రస్తులను నానాటికి చేవ లేనివారిలా మారుస్తుంది. కానీ సుషుమ్న క్రియా యోగ దీక్షను స్వీకరించిన అనిర్ బన్ సాధనను ఆరంభించిన పది రోజుల్లోనే తనను దీర్ఘ కాలంగా బాధిస్తున్న అల్సరేటివ్ కొలైటిస్ నుండి విముక్తుడయ్యాడు. సాధన దిన దిన ప్రవర్ధమానం అయ్యే కొద్దీ లక్షణాలు తగ్గుముఖం పట్టటం ప్రారంభమైంది. నెమ్మదిగా రక్తవిరోచనాలు ఆగిపోవటం, కడుపు నొప్పి తగ్గిపోవటం అన్ని ఆశ్చర్యకరంగా జరిగిపోయాయి. అనిర్ బన్ పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలగటానికి పరమ గురువులు శ్రీ భోగనాథ మహర్షులు, శ్రీ మహావతార్ బాబాజీ గారు, మన గురు మాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగార్ల అనుగ్రహమే కారణం. గురువుల చరణాలకు భక్తిపూర్వక ప్రణామాలు.

Share.

Comments are closed.