Welcome to the BLISSFUL journey

యు. అనుపమ అనుభవాలు

0

2008వ సంవత్సరం ఏలూరు వాస్తవ్యులు అనుపమ గారికి సడెన్ గా కళ్ళు తిరగడం, తల తిరగడం మొదలైంది.డాక్టరుకి చూపించుకుంటే వర్టిగోగా నిర్ధారణ చేసి మందులు ఇచ్చి పంపించారు. కానీ ఎన్ని మందులు వాడినా తగ్గకపోగా ఆరోజుకారోజు ఎక్కువై చివరికి బాత్ రూమ్ కి వెళ్ళాలన్న తన తల్లిగారి సాయం తీసుకోవలసి వచ్చేది. పూర్తిగా వారు మంచానికే పరిమితమై పోయారు. ప్రతీ చిన్న పనికి కూడా వారి అమ్మగారి మీద ఆధార పడవలసి వచ్చింది. ఆ స్థితిలో అనుపమగారు చాలా మనోవేదనకు గురి అయ్యారు. ఈ వయసులో అమ్మకు సేవ చెయ్యవలసిన నేను అమ్మచేత చేయించుకుంటున్నానే అని బాధ పడుతూ అసలు ఎన్ని రోజులు ఇలా నేను మామూలు స్థితికి రాగలనా? అని వేదన పడ్డారు. తన బాధనంతా భర్త గారి దగ్గర చెప్పుకుని ఏడ్చేసారు.అనుపమగారి బాధని చూసిన ఆమె భర్తగారు మళ్లీ వేరే న్యూరాలజిస్ట్ కి (neurologist) చూపించారు. డాక్టర్స్ బ్రెయిన్ కి సిటీ స్కాన్ , సర్వైకల్ స్పైన్ MRI చేయించి, తను సర్వైకల్ వర్టిగోతో బాధపడుతున్నట్లు నిర్ధారించి కౌన్సిలింగ్ చేసి, జీవితాంతం స్టూజిరాన్ టాబ్లెట్స్ రోజుకి మూడు,నాలుగు వేసుకోవాలని సూచించారు. ఆ రోజు నుంచి రోజు 3 లేక4 స్టూజిరాన్ టాబ్లెట్స్ వేసుకుంటూ కాలం గడిపారు. టాబ్లెట్స్ వేసుకోవడం కొంచం ఆలస్యము అయితే విపరీతంగా తల తిరిగి పోయి పడిపోయేవారు. ఇలా సాగుతుండగా 2013 లో అంటే 5 సంవత్సరాల తరువాత ఒక రోజు సుషుమ్న క్రియా యోగ ధ్యానం గురించి తెలిసి ధ్యానం క్లాస్ కి వచ్చారు. మొదట్లో 7 నిమిషాలు కూడా ధ్యానం చెయ్యలేక పోయేవారు. కళ్ళు మూసుకోగానే వెంటనే పెద్ద జైంట్ వీల్ మీద నుండి కిందకి పడిపోతున్నట్టు అనిపించేది, కానీ పట్టుదలతో నమ్మకంతో ఎలాగో డాక్టర్స్ చేతులు ఎత్తేశారు కనీసం ఎంత కష్టమైనా ధ్యాన సాధన చేసుకుంటాను. గురువులు నా పరిస్థితికి కరిగి దయతో నాకు సాయం చెయ్యకపోతారా? అనే ఆశతో సాధన సాగించారు. 6 నెలలలో అనుపమ గారు 21 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసే స్థితికి చేరుకున్నారు. వర్టిగో కూడా చాలా మటుకు తగ్గిందని అనిపించి, రోజుకి 3,4 టాబ్లెట్స్ బదులు 1,2 టాబ్లెట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ తల తిరగటం మాత్రం రాలేదు.నెమ్మదిగా టాబ్లెట్స్ అన్నీ ఆపేసారు.చిత్రంగా అందరిలా తను మునుపటిలా ఆరోగ్యంగా జీవించడం మొదలు పెట్టారు.గురువుల అద్భుత కృప ఏపాటిదో కదా! 5 సంవత్సరాలు డాక్టర్స్ ట్రీట్ చెయ్యలేం అని చేతులు ఎత్తేస్తే జీవత్సవంలా ఒకరి మీద ఆధారపడి బ్రతికిన అనుపమగారికి 6 నెలల సాధనలో పూర్తి స్వస్థత చేకూరి తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఆనందంగా జివించగలుగుతున్నారంటే ఇది గురు మాత,పరబ్రహ్మము అయిన ఆత్మానందమయి అమ్మగారి అనంత దివ్య లీలలు కాదా!
ఓం శ్రీ గురుభ్యోనమః.

Share.

Comments are closed.