Welcome to the BLISSFUL journey

Day 13 – మంజుల భాషిణి, ప్రణవ స్వరూపిణి ఆత్మానందమయి అమ్మగారు

0

ఆ రోజు డెహ్రాడూన్లో దీక్షా శిబిరాల నిర్వహణ కోసం అందరం ముస్సోరీ నుండి కింద డెహ్రాడూన్ కు వెళ్ళాం. అమ్మగారు అక్కడ ఎంతో ఓపికగా ఒకే రోజులో దరిదాపు 4 ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మగారి ప్రవచనం ఆంగ్లంలో సాగింది. ధ్యాన సాధన, సుషుమ్న క్రియా యోగ విద్యను గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పారు అమ్మగారు. యోగ ముద్ర ద్వారా శ్రీచక్రం ఏర్పడుతుందని, అలాగే ఈ ధ్యాన పద్ధతి వల్ల అత్యధిక స్థాయిలో విశ్వ శక్తి ప్రవాహం జరుగుతుందని, ఓంకారాలను గురించి, శ్వాసలను గురించి, భ్రూమధ్యంలో దృష్టి గురించి అనేక విషయాలు చెప్పారు అమ్మగారు. దీక్ష జరిగిన 4 పర్యాయాలు అలసట లేకుండా ఎంతో శక్తిమంతంగా ఉన్నారు అమ్మగారు. వరుసనే 4 కార్యక్రమాలు అనేసరికి చాలా శక్తి కావాలి. అలాగే ప్రతీ క్లాసులో కొత్త సాధకులు ఉంటారు కాబట్టి ప్రక్రియను పూర్తి వివరంగా చెప్పాలి.సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి, కలుషితమైన మనోమయకోశాన్ని శుద్ధి చేసి, ఆలోచనల పరంపర నుండి అందరికీ శాంతిని కలిగించటం అంత తేలిక కాదు. గురువులు తమ యోగ శక్తిని ధార పోసి సాధకులకు శక్తిని ప్రసాదిస్తారు.  గురువులు రహస్య ప్రక్రియ ద్వారా శిష్యుల దుష్కర్మలను స్వీకరించి, తమకు మాత్రమే సాధ్యపడే ప్రక్రియల ద్వారా కర్మల ప్రభావాన్ని నశింపచేస్తారు. అలా చేసినప్పుడు గురువులు శారీరకమైన ఇబ్బందులు కూడా అనుభవిస్తారు. ఇవన్నీ తెలిసిన మాకు అమ్మగారు ఒకే రోజు అన్ని సెషన్లు చేస్తున్నారని బాధ కలిగింది. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత తిరిగి ముస్సోరీకి వెళ్లిపోయి ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి, మరుసటి నాడు ఉదయం యమునోత్రికి బయలుదేరాం.

Share.
Leave A Reply