Welcome to the BLISSFUL journey

Day 14 – 15 దేవదారు వృక్షాలు

0

డెహ్రాడూన్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది తెహ్రి అనే ప్రాంతం. అక్కడే యమునోత్రికి వెళ్లేముందు బస చేశాo. ఆ ప్రాంతమంతా ప్రకృతి సౌందర్యంతో ప్రకాశిస్తోంది. మేము ఉండేందుకు అందమైన టెంట్లు ఉన్నాయి ఆ రిసార్ట్లో, టెంటు లోపల వెచ్చగా, బయట శీతలంగా, చుట్టూ దట్టమైన చెట్లతో చాలా బాగుంది ఆ ప్రాంతం. ఎదో స్వప్న లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది అక్కడ. అక్కడికి సమీపంలోనే యమునా నది పాయ ప్రవహిస్తోంది. మా రిసార్టుకు కొద్ది దూరంలో పెద్ద పెద్ద చెట్లతో ఒక ప్రాంతం ఎదురుగా కనిపిస్తోంది. సాయంత్రం, ఇంకా చీకటి పడలేదు, ఆ సమయంలో అమ్మగారు మేము తెహ్రికి చేరగానే ఎదురుగా కనిపిస్తోన్న అడవి వంటి ప్రాంతానికి “వెళదాం రండి” అని అందరికీ చెప్పారు. పరమ గురువులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, వారి పెద్ద చిత్ర పటాల్ని అక్కడ అమర్చారు. మేము వచ్చే లోపే ఏర్పాట్లు ఎలా జరిగాయా అని ఆశ్చర్యం కలిగింది! అమ్మగారు ఆ ప్రాంతానికి చేరిన వెంటనే ఎదురుగా ఉన్న ఆ స్థలాన్ని సందర్శించి అక్కడ దాదాపు 700 సంవత్సరాల వయసు గల 15 పెద్ద పెద్ద దేవదారు వృక్షాలను ఎంపిక చేశారట. ఆ చెట్ల నీడలోనే పరమ గురువుల చిత్తరువులను, అమ్మగారు కూర్చునేందుకు ఆసనం, మ్యాటు వంటి ధ్యానానికి కావాల్సిన ఏర్పాట్లు ఆఘ మేఘాల మీద, అమ్మగారి ఆజ్ఞానుసారం చేసి సిద్ధంగా ఉన్నారు కొందరు శిష్యులు. అమ్మగారు భౌతికంగా ఆ ప్రదేశానికి రావటం అదే తొలిసారి, కానీ ఆ ప్రాంతం పరమ గురువులు జరిపించనున్న ప్రక్రియకు అనుకూలమైనది అని అమ్మగారి దివ్య దృష్టికి తెలిసిపోయింది. టెంట్ల వద్ద నుండి అమ్మగారితో పాటుగా నడుస్తూ ఉండగా….

Share.
Leave A Reply