Welcome to the BLISSFUL journey

Day 19 – గురు మాటే వేదం

0

పూర్వ పుణ్యం వల్ల మానవ దేహం లభించినా, దాన్ని వజ్ర దేహంగా మార్చేందుకు ప్రత్యక్ష గురువు కావాలి. పరమ గురువుల అనుగ్రహం వలన ఈ ఆధునిక యుగంలో సుషుమ్న క్రియా యోగ మహా విద్య, అమ్మగారి ద్వారా మనకు లభించడం ఎంతటి మహద్భాగ్యం అనిపిస్తుంటుంది తోటి సుషుమ్న క్రియా యోగుల దివ్య అనుభవాలు విన్నప్పుడు ..”నాగ తేజకు ఇంతటి దివ్యమైన అనుభవం కలగటానికి కారణం, ఆయన నిస్వార్థ వ్యక్తిత్వం “అన్నారు అమ్మగారు.”తనకు సమీపాన ఉన్న చెట్టును వేరొకరికి ఇచ్చిన తేజ, గురువుల అనుగ్రహానికి పాత్రులు కాగలిగారు. ‘నాది’ అన్న భావనతో ఉన్నంత సేపు పొందాల్సిన స్థాయిలో సాధకులు పొందలేరు. దేహ కాంక్ష, స్వార్ధం వదిలిపెట్టి, ఉన్నతంగా ఆలోచించగలిగిన నాడు దైవత్వం సిద్ధిస్తుంది “అన్నారు అమ్మగారు. అమ్మగారు నాగతేజాను అప్పటికే వేరొకరు ఉన్న చెట్టు వద్దకు పంపించటానికి కారణం లేకపోలేదు. మహా గురువులు చేసిన దానికి అర్థం, పరమార్థం తప్పకుండా ఉంటాయి. నాగతేజ, ప్రక్రియ సాగించిన చెట్టు వద్ద మాత్రమే కాండం రెండు భాగాలుగా ఉంది. అమ్మగారు ప్రక్రియ ప్రారంభంలో చెట్ల వద్దకు వెళ్లి తమ శిష్యుల కర్మలు తీసుకునేందుకు వాటి సమ్మతిని కోరుతున్నప్పుడు, ఆ వృక్ష దేవత ఇద్దరి కర్మలు స్వీకరిస్తానని చెప్పిందట. ఈ విషయం అమ్మగారే స్వయంగా మాకు తెలియజేశారు.ఇంతటి అద్భుత ప్రక్రియను జరిపించిన పరమ గురువులకు, ప్రత్యక్ష గురువులైన అమ్మగారికి వినమ్ర నమస్సులు మనసులో తెలియచేసుకున్నాం

Share.
Leave A Reply