Welcome to the BLISSFUL journey

Day 21 – సుషుమ్న క్రియా యోగులు సత్ సంకల్పాలే చేయాలి

0

ఉధృతంగా కురిసిన వర్షం కొద్ది సేపటికి తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నాగతేజ, కాస్త బెరుకు సందేహం మిళితమైన ముఖ కవళికలతో అమ్మగారు వద్దకు వచ్చారు. “ఏంటమ్మా” ? అని అమ్మగారు అడిగినప్పుడు, ఇలా అన్నారు. “అమ్మా, ఇందాక మీతో సత్ సంగం జరుగుతునప్పుడు  ఒక ఆలోచన కలిగింది…..”అన్నారు. భయంగానే తనకు కలిగిన ఆలోచనను బయట పెట్టారు తేజ. అందరం ఆయన ఎం చెప్తారోనని ఆసక్తిగా వింటున్నాం. ఆయన తనకు కలిగిన సంకల్పాన్ని గురించి అమ్మగారికి వివరిస్తూ “ఇప్పుడు వర్షం పడితే బాగుండు అనుకున్నానమ్మా అంతే!  వెంటనే వర్షం మొదలైంది”అన్నారు. అమ్మగారు నవ్వుతూ ఇలా చెప్పుకొచ్చారు, “సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా సాధకులందరికీ ప్రకృతితో సమన్వయము ఏర్పడుతుంది. అలాగే సుషుమ్న క్రియా యోగులైన మీరు ఏ సంకల్పం చేసినా అది తప్పకుండా నిజమై తీరుతుంది”. అందుకే మీరందరూ సత్ సంకల్పాలే చేయాలన్నారు. వర్షం పడటానికి అసలు కారణం తెలిసి, నివ్వెరపోయిన వారు కొందరైతే, యువ బృందంలో కొందరు నాగతేజ వైపు ‘నీ వల్లే ఈ వర్షం’ అన్నట్లు గుర్రుగా చూశారు.  ఉదయాన్నే లేచి యమునోత్రికి వెళ్ళాలి కాబట్టి “అమ్మగారిని విశ్రమించనివ్వండి” అని రామచంద్ర గారు అనటంతో అందరం టెంట్లలోకి వెళ్లిపోయాం.  మరు నాడు ఉదయాన్నే లేచి గబగబా తయారై యమునోత్రికి బయలుదేరేందుకు బస్సుల్లోకి ఎక్కి కూర్చున్నాం.

Share.
Leave A Reply