Welcome to the BLISSFUL journey

Day 22 – యమున

0

‘యమున’ అంటే కవల అని అర్థం. పుణ్య గంగా నదితో సమాంతరంగా ప్రవహించే ఈ నదికి ‘యమున’ అన్నపేరు వచ్చిందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.చతుర్ వేదాల్లో మొదటి వేదమైన ఋగ్వేదంలో యమునా నది ప్రస్థావన కనిపిస్తుంది. ఋగ్వేదానుసారం, తన కవల అయిన యముడి పట్ల అమితమైన ప్రేమానురక్తి ప్రదర్శించిన యమునతో ఆమెకు తగిన వరుడిని వెతుక్కోమని పంపిస్తాడు యముడు. అప్పుడు ‘యమున’ తనకు తగిన వారు శ్రీ కృష్ణ పరమాత్ములని భావించి, స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసంతో, ప్రేమతో ఆయన  లీలలన్నిoటికి  సాక్షిగా నిలుస్తుంది. శ్రీ కృష్ణుడి వర్ణం, యమున వర్ణం ఒకేలా ఉంటుందని పురాణాలు చెబుతాయి. లీలా మానుష విగ్రహుడైన శ్రీ కృష్ణుడి జననానంతరం, స్వామి పాద స్పర్శతో శాంతించి, వసుదేవులకు మార్గమిచ్చిన పుణ్య నదీ ప్రవాహం ‘యమున’. అటువంటి యమున పుట్టిన చోటు యమునోత్రి. యమునా నది ఈ భూమిలోని పాప పంకిలాన్ని నశింపచేయాలని భావించిందని యమునాష్టకంలో రాయబడింది. అందుకేనేమో, పూజ్యశ్రీ ఆత్మానందమయి ఆమ్మగారు శిష్యుల కర్మలను తగ్గించే రహస్య ప్రక్రియను యమున ఒడ్దునే జరిపారు. నీటి ప్రవాహాలు, నదులు, ఉండే ప్రదేశాల్లో చాలా అధికమైన శక్తి ప్రకంపనలు ఉంటాయని అనేక మార్లు అమ్మగారు చెప్పారు.

Share.
Leave A Reply