Welcome to the BLISSFUL journey

Day 23 యముడి పాశాన్ని హరించే ‘యమున’

0

ఆధ్యాత్మిక , యోగిక శక్తిని ఇనుమడింప చేసే  సామర్థ్యం   యమునా నదికి ఉన్నట్లు చెబుతారుగంగమ్మ మోక్ష  సాధనకు కారణం కాగలిగితేయమునా నది మానవుల్లోజీవరాశుల్లో  ప్రేమ తత్వాన్ని ప్రోధి చేస్తుందటమరణాన్నిసంభవింప చేసే యముడి పాశం నుండి విముక్తిని కలుగ చేసి, ‘మృత్యోర్మా అమృతంగమయా” అంటూ మృత్యువు నుండి అమృతత్వం  దిశగా నడిపించే మాత యమున’ అన్నది పురాణ గాథకాళింది పర్వత పుత్రికయే యమునా నది అని,మహాభారతంలో  పాండవుల   రాజధాని అయిన ఇంద్రప్రస్థo  కూడా యమునా నది ఒడ్డునే  ఏ ర్పాటు చేయబడింది అని భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది . అయితే  సూర్య  భగవానుడి పుత్రిక యమున’ అని కూడా ప్రస్థా వించబడింది. దీనికి యోగ శాస్త్ర సమన్వయం ఉంది.

Share.
Leave A Reply