Welcome to the BLISSFUL journey

Day 28 – యమునోత్రిని చూసి అమ్మగారు దిగ్బ్రాంది

0
యమునోత్రి పైకి వెళ్లి కూడా అక్కడ స్నానం చేయలేకపోయాము. దానికి కారణం, అంతటి పవిత్ర
నదిని కొందరు కలుషితం చేయటమే. పరమ పవిత్రమైన యమునా నది పుట్టిన ఆ క్షేత్రంలో కొందరు మాసిన
వస్త్రాలు, భయంకరమైన చెత్త, క్లేశ పూరితమైన ప్లాస్టిక్ పదార్థాలు, కొందరు అక్కడే విసర్జనలు చెయ్యటం,
ఇవన్నీ చూసిన అమ్మగారు ప్రళయ స్వరూపిణి
అయిన కాళీ మాతలా ఒక్కసారిగా వేరొక స్థితికి వెళ్లిపోయారు. అజ్ఞానంతో, అవగాహనా లేమితో,
నదిని అంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చిన
మానవుల అజ్ఞానానికి చింతాపరులై, ఒక్క అరగంట పాటు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి అంటూ టెంట్లోపలికి వెళ్లారు అమ్మగారు. అందరం మౌనంగా మారం. ఆ రోజు ఉదయం అల్పాహారం తరువాత అమ్మగారు ఏమి తినలేదు. అప్పటికి సాయంతరం కావస్తోంది. అందరం బయటే వేచి ఉన్నాం. ఒక అరగంట గడిచాక అమ్మగారు బయటకు వచ్చి, “పదండి ఇక బయలుదేరండి” అన్నారు.
అమ్మగారు, మౌనంగా ఉండటానికి కారణాన్ని మాతో చెప్తూ, “మూడు జన్మల క్రితం
నేను చూసినప్పటి యమునోత్రిని ఇంతగా కలుషితంగా మార్చినందుకు చాలా బాధ కలిగింది”అన్నారు. “ఒక విధమైన కలతలా” అనిపించిందన్నారు. ఆ రోజు సుషుమ్న
క్రియా యోగులందరికీ ఒక సూచన చేశారు అమ్మగారు. “నదులకు, పుష్కరాలకు, సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు నీటిలో బట్టలు వదిలేయటం అనేది చాలా తప్పు” అన్నారు. సుషుమ్న క్రియా యోగులుగా ప్రకృతిని కలుషితం చెయ్యటంలో మనం ఎన్నటికీ కారకులం కాకూడదు. సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని మీ కుటుంభ సభ్యులతో చెప్పే ప్రయత్నం చెయ్యండి అన్నారు. ఆ తరువాత తిరుగు ప్రయాణం కోసం బయలుదేరాం. అప్పటికి సూర్యాస్థమయo అవుతున్నది. అమ్మగారు కాలినడకనే పర్వతం కిందకి వస్తానన్నారు. కానీ శిష్యులంతా బతిమాలి అమ్మగారిని ఢోలి ఎక్కించాం. అమ్మగారి ఢోలి వెనుకే కొంత మంది శిష్య బృందం బయలుదేరారు. అమ్మగారి ఢోలితో పాటు ఉన్న బృందమంతా చాలా వేగంగా నడిచి వెళ్లిపోయారు. కొంతమంది  నెమ్మదిగా నడుస్తున్నాం.  ఉదయం నుండి నడిచే సరికి కాళ్లలో కాస్త సత్తువ తగ్గింది.
కొంత దూరం నడచిన మాకు ఎటువెళ్లాలో తెలియలేదు. మనుషుల జాడ ఎక్కడా కనపడటం లేదు. అప్పుడు శునకం ఒకటి ఎక్కడి నుండో వచ్చి మాకు దారి చూపింది. సాక్షాత్తు కాలభైరవ స్వామే అని దణ్ణం పెట్టుకున్నాం. యమునోత్రి పైకి ఎక్కేటప్పుడు చాలా మంది యాత్రికులు ఉన్నారు, కానీ తిరుగు ప్రయాణంలో కొన్ని చోట్ల పూర్తి నిర్మానుష్య స్థలాలు ఉన్నాయి. ఆ రోజు చాలా వింతైన అనుభవం కలిగింది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, మహా వృక్షాలు, జలపాతాలు, లోయలు, వేగంగా ప్రవహిస్తోన్న నది. ఇవన్నీ మనకంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. వాటి మధ్యలో చాలా సూక్ష్మంగా ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఒంటరిగా నడుస్తున్నా, ప్రాణ భయం, ఏదైనా జరుగుతుందన్న జంకు ఏమీ లేవు. చాలా ధైర్యంగా, ఎదో అదృశ్యశక్తి మనతో ఉందన్న స్థైర్యంతో ముందుకు సాగాo.
“పూల యదలలో పులకలు పొడిపించే భ్రమర రవం.. ఓంకారం….,
 సుప్రభాత వేదిక పై శుకపికాది కలరవం…ఐంకారం,
పైరు పాపాలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా…..
గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా…
ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే….” అంటూ ప్రకృతి సొగసును బీజాక్షరాలతో వర్ణించిన కవి పాటను గుర్తు చేసుకుంటూ అక్కడి అందాలకు ప్రణతులు సమర్పించి బస్సులో కూర్చొని తిరిగి హర్షిల్  చేరాం.
Share.
Leave A Reply