Welcome to the BLISSFUL journey

Day 36 – శ్రీ చక్ర పర్వతం

0

అమ్మగారి కాటేజీకి కుడి భాగంలో ఒక బంగారు పర్వతం ఉంది. లోపల అమ్మగారు సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తూ ఉన్నారు. ఈ పర్వతం అనేక రంగులు మారుతోంది. ఆ పర్వతాన్ని చూస్తుంటే, నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి చైతన్యవంతమై సుషుమ్న మార్గం గుండా సహస్రారాన్ని తాకినప్పుడు విచ్చుకున్న సహస్రదళ పద్మపు సువర్ణ కాంతులీనుతూ కనిపించింది. ఆ పర్వతం పై ఒక పక్క సూర్య కాంతి, మరో పక్క చంద్ర కాంతి ప్రసరిస్తోంది. సూర్య కాంతి వల్ల ఎర్రగా, చంద్ర కాంతి వల్ల తెల్లగా, ఈ రెండిటి సమన్వయo వల్ల ఉద్భవిస్తున్న చిచ్ఛక్తికి ప్రతీకగా బంగారు రంగులో కనిపిస్తోంది ఆ పర్వతం. సూర్య చంద్రాగ్ని నాడుల కలయిక ద్వారా కురిసే అమృతపు ధారకు ప్రతీకగా ఆ కొండ నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తోంది గంగ. ఆ పర్వతం శ్రీ యంత్రంలా ఒక మహా మేరువులా కనిపించింది. గురువుల లీలానుగుణంగా యోగ ముద్ర ద్వారా మా సూక్ష్మ శరీరాల్లో ఏర్పడే శ్రీ యంత్రాలను భౌతికంగా ఆ పర్వతంలో దర్శించగలిగాం అనిపించింది.  ఆ అద్భుత ప్రదేశంలోనే  సుషుమ్న క్రియా యోగులమంతా బస చెయ్యటం ఎంతటి ఆశ్చర్యకరం కదా!

Share.
Leave A Reply