Welcome to the BLISSFUL journey

Day 45 – గౌరి శంకర్ పీఠం ప్రవేశించే రహస్యం చెప్పిన అమ్మగారు

0

ప్రతీ రోజు ధ్యానం చేసినప్పుడు పరమ గురువులు ఎక్కువ శక్తి ప్రకంపనలు పంపిస్తారనటానికి….
అక్కడ బ్రహ్మ ముహూర్తంలో, 3: ౦౦ గంటల సమయంలో శివలింగంపై మూడు నీలి రంగు తామర పూలను ఉంచారు. 49 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు ఒక తామరను చేతపట్టి, బాబాజీ గారి పాదారవిందాలకు భక్తితో సమర్పిస్తున్నారు. మనమంతా ముద్ర పెట్టి ధ్యానం చేసినట్లే, అక్కడ కూడా 49 మంది, అదే ముద్రలో ధ్యానం చేస్తున్నారు. బాబాజీ గారి శిష్యులు మనకి గైడింగ్ మాస్టర్లు గా కూడా వస్తారు. వారు గౌరి శంకర్ పీఠంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు, వారి సూక్ష్మ శరీరాలు విడిపడి వారి ఫ్రీక్వెన్సీకి సరితూగే సాధకుల వద్దకు గైడింగ్  మాస్టర్లు గా వస్తుంటారు. అలాగే అక్కడ గోవులు తెలుపు, గోధుమ రంగులో ఉన్నాయి.
6 గంటలకు, ఒక చిన్న మట్టిపాత్ర వంటి దాంట్లో శివలింగం వద్ద పాలను ప్రసాదంగా ఉంచారు. మరొక పాత్రలో శ్రీ మహావతార్ బాబాజీ గారి వద్ద పాలను నైవేద్యంగా ఉంచారు. కానీ వారు పాలను తాగటం వంటిది చేయలేదు. వారు భౌతికంగా అక్కడ ఉన్నా, అక్కడ లేరు. అదృశ్యంగా వేరొక చోట ఉన్నారు. అక్కడ వారి చుట్టూ దివ్య కాంతి ప్రకాశిస్తోంది. మనలో కూడా కొందరు సాధకులు గౌరి శంకర్ పీఠం వరకు చేరగలుగుతున్నారు. ఇంకా ధ్యాన శక్తి పెరిగినప్పుడు వారు ఆశ్రమం బయట రక్షణగా ఉన్న శక్తిని దాటుకొని లోపలికి వెళ్లగలుగుతారు” అంటూ చెప్పారు అమ్మగారు.

Share.
Leave A Reply