Welcome to the BLISSFUL journey

Day 6 లోయలంటే భయం

0
ఉదయం ప్రారంభమైన మా ప్రయాణం నిర్విరామంగా అప్పటి వరకు సాగింది. అప్పటికి 4:30 సమయం కావస్తోంది. మరల ప్రయాణం ప్రారంభమైంది. అలా మరి కొద్ది సేపు ప్రయాణం సాగింది. ఎంత పైకి వెళుతున్నా, ఇంకా గమ్య స్థానం కనుచూపు మేరలో కనపడటంలేదు. ప్రయాణం ముందుకు సాగే కొద్దీ తెలిసింది ఆ పర్వతం ఎత్తు. దట్టంగా కమ్ముకున్న మబ్బులను చీల్చుకొంటూ సాగిపోతున్నాం.   మార్గం మధ్యలో ఒకచోట బోలేనాథ్ మందిర్ కనిపించింది. అయితే అక్కడ ఆగే సమయం లేకపోవటంతో బయట నుండే స్వామికి నమస్కారం చేసుకున్నాం. ఆ గుడి అంతా ఎర్రని జెండాలు ఉన్నాయి. సమీపంలోనే స్కూల్ కూడా ఉంది. గంట సేపు మా ప్రయాణాంతరం ముస్సోరీ DRDO కార్యాలయం చాలా ఎత్తులో ఉందని చెప్పారు. కారు నుండి కిందకి చూస్తే, ఎంత లోతైన లోయ అంటే డ్రైవర్ కాస్త అలసత్వంగా ఉన్నా అంతే సంగతులు. కొన్ని చోట్ల కారు వెనుకకు కూడా వెళుతోంది. గురువులను తలుచుకుంటూ ముందుకు సాగం. మా బృందంలో శివ శుక్ల గారికి ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయమట. ఆ రోజు వారు ఉత్సాహంగా డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. దిగాక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని గాబరా పడ్డారు మా బృందంలోని పెద్దలు.
Share.
Leave A Reply