Welcome to the BLISSFUL journey

ఎస్. జయంత్ అనుభవాలు

0

జయంత్ గారు సుషుమ్న క్రియా యోగములోకి వారి అమ్మగారి ద్వారా ప్రవేశించారు. మెల్లి మెల్లిగా వారు మెడిటేషన్ చెయ్యడానికి అలవాటు పడ్డారు.మొదట్లో ఎనర్జీ ఎక్కువ అయ్యి శరీరమంతా ఊగిపోయేది.వారి ఇంటికి అమ్మగారు వచ్చినపుడు వారి నిరాడంబరత,ప్రేమ పూర్వకమైన స్పర్శ అనుభవించిన జయంత్ గారికి బ్లిస్ ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థమైంది.పలనిలో మెడిటేషన్ లో భోగనాథ మహర్షుల వారి దర్శనం అయింది.నా పూర్ణాత్మ ఎవరు? అన్న ఆయన ప్రశ్నకి ధ్యానంలో సూర్య దర్శనం అయింది.
కాలేజీ హాస్టల్ లో మెడిటేషన్ లో శ్రీ మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. పలనిలో గురు పౌర్ణమిలో శ్రీ భోగనాథ సిద్ధులు ధ్యాన తపస్సు ఆసనం నుంచి లేస్తున్నట్లు దర్శనం ఇచ్చారు. కాలేజీ హాస్టల్ లో శ్రీ బాబాజీ గారు జయంత్ గారి దృష్టి భ్రూమధ్యం వైపు ఫోకస్ చెయ్యడానికి గైడ్ చేశారు అని ఆయనకి అర్థం అయింది.
సుషుమ్న క్రియా యోగము వలన పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఎలా జరుగుతుంది? అనడానికి జయంత్ గారి అనుభవాలే ఉదాహరణ.ఇంటర్మీడియట్, జెయియి ప్రిపరేషన్ సమయంలో జయంత్ గారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ , సెల్ఫ్ డౌట్ ఉండేవి. మెడిటేషన్ చెయ్యడము వలననే ఆ విషయం అర్థమై మెల్లి మెల్లిగా నాకు గురువుల సపోర్ట్ ఉంటుంది అని తెలిసి వాటన్నింటి నుంచి బయటపడగలిగారు జయంత్. రోజు చేసే ధ్యానంలో కొన్ని రోజులు బ్రేక్ వచ్చినా, చెయ్యలేకపోయినా జీవితములో ఎదో మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్,మళ్లీ మెడిటేషన్ ప్రారంభించగానే ,లోలోపల చాలా తృప్తిగా అనిపించడము అతను గమనించగలిగారు.మనకు తెలియకుండానే ధ్యానము అండర్ కరెంటులాగా మనలో మార్పు తీసుకు వస్తుంది అని అర్థమైంది.
క్యాంపస్ ఇంటర్వ్యూలో మొదటి రౌండ్ తరవాత “ఈ రెండు రోజులు నువ్వు నాతో ఉండాలి” అన్న బాబాజీ గారి మెసేజ్ వినిపించింది.అప్పుడే తను సెలెక్ట్ అవుతాడు అన్న నమ్మకం అతనికి వచ్చేసింది.మరుసటి రోజు నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యాడు అని తెలియగానే ఆ నమ్మకం ఇంకా బలపడింది.ఆ సాయంత్రం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో తన సబ్జెక్ట్ కు సంబంధము లేని ప్రాససర్స్ గురించి చదివారు జయంత్.ఆ మర్నాడు ఇంటర్వ్యూలో తను చదివిన సబ్జెక్టు నుంచే ప్రశ్నలు వచ్చాయి.ఆ తరవాత కాలేజీ లైబ్రరీకి వెళ్లి బేసిక్స్ చదువుకుని వెళితే , ఆశ్చర్యంగా ఆ రౌండ్ లో ఏమి ప్రిపేర్ అయ్యారో ఆ ప్రశ్నలే వచ్చాయి…జయంత్ గారు సెలెక్ట్ అయినప్పుడు ఆయనకు అసలు ఆశ్చర్యమనిపించలేదు ఎందుకంటే ఇదంతా ఎవరో ముందే నిర్ణయించేశారూ అనిపించింది.తన లాంటి ఆవరేజ్ స్టూడెంట్ అందరూ కలలుకనే అధ్బుతమైన కంపెనీలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉద్యోగంలో ఆశీర్వదించబడడం కేవలము తను చేస్తున్న మెడిటేషన్ ప్రభావము ,గురువుల అనుగ్రహము అంటారు జయంత్.
జయంత్ గారి అనుభవాలు అనేక సైకలాజికల్ కాంప్లెక్స్,ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తో బాధపడేవారికి ముఖ్యంగా విద్యార్థి దశ ,కెరియర్ సెటిల్ మెంట్ కావాలి అనుకునేవారికి ఎంతో ఉపయోగిస్తుంది.

Share.

Comments are closed.