Welcome to the BLISSFUL journey

కౌశిక్ బాబు అనుభవాలు

0

చిన్నప్పటి నుంచీ సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరగడం వలన భక్తి, దైవారాధన సహజంగా అనిపించే కౌషిక్ గారికి, చిన్నప్పుడే ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలపడము – నటుడిగా పౌరాణిక పాత్రలు ముఖ్యంగా అయ్యప్ప వేషధారణలో – తాను ఎన్నడూ దర్శించని అయ్యప్ప బంగారు కళ్లు నిరంతరం దర్శనం ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా అనిపించేది….అతను గుడి, దేవతలు, పూజలు, హోమాలు – ఈ పద్ధతి నమ్ముతారు కానీ, మామూలుగా మన అందరిలాగా సామాన్య జీవితం గడిపే వారికి దైవత్వం ఆపాదించే విషయం అతనికి నచ్చకపోగా అది మూర్ఖంగా కూడా అనిపించేది….వ్యక్తి పూజ చేస్తూ అది శక్తి పూజ,ఎనర్జీ ఫీల్డ్స్ వగైరా మాటలు నచ్చేవి కావు అతనికి…అనుగ్రహ శక్తి గుడిలో దేముడి దగ్గర వుండాలి కానీ,మామూలుగా వుండే మనుష్యులకు ఆపాదించడమేమిటి?! అన్నది అతని మనస్సులోని సందేహం.
మరి కౌశిక్ బాబు ఈనాడు సుషుమ్న క్రియా యోగిగా ,అధ్బుతమైన గురు అనుగ్రహంతో ఈ నాటి ఈ స్థితికి అతి కొద్ది రోజులలో ఎలా ఎదిగారు?!
అతనికి చిన్నప్పటి నుంచే ఆరాలు – బంగారు రంగు,వెండి,ఎరుపు,ఆకుపచ్చ రంగులో కనిపించేవి…కానీ, అవి అందరికీ తెలుస్తూ వుంటాయి అనుకున్నాడేమో ….2012 ప్రాంతంలో మొట్ట మొదటిసారి అతను శ్రీ ఆత్మానందమయి అమ్మగారి దర్శనం చేశారు కానీ …అతను ఎందుకో అమ్మగారి దైవత్వాన్ని అంగీకరించలేకపోయారు.ఆ తరవాత చాలా సార్లు దర్శించుకున్నా , ఎందుకో అతనికి ఏ భావము అనిపించలేదు…ఈ నాడు కౌశిక్ బాబు అద్భుత స్థితి,అతని గురు దర్శనాలు గురించి ,అధ్బుతమైన దైవీక మైన అనుభవాలు గురించి వింటున్నప్పుడు – మరి ఆ నాడు అతనికి ఏ భావన ఎందుకు కలగలేదు?! అన్నది గొప్ప జిజ్ఞాస కలిగించే విషయము”….దానికి కారణము నాలో “ఆ పరిపక్వత లేదు” అంటారు కౌశిక్ బాబు…కానీ, అతని చుట్టూ ఉన్న మాయ పొరలు తొలగించి నిజగురు దర్శనము చేయించగల శక్తి ఒక సుషుమ్న క్రియా యోగానికే ఉన్నది. అతనెవరో అతనికి తెలిపింది ఈ ధ్యానమే ….గురువాయూర్ లో అక్క శృతకీర్తిగారు తమ్ముడికి సుషుమ్న క్రియా యోగ దీక్ష ఇచ్చి అధ్బుతమైన ఆధ్యాత్మిక జీవన పథానికి నాంది పలికారు…అంతేకాదు అతని అంతః ప్రయాణం ఆ రోజే ప్రారంభం అయింది. అంత వరకు ఎన్నో మెడిటేషన్స్ చేసిన అతనికి ఏ నాడు కలగని అనుభవాలు ఆ నాడే ప్రారంభమయ్యాయి…ఆ రోజు రాత్రి మెడిటేషన్ లో శ్రీ మహావతార్ బాబాజీ గారు వజ్ర దేహంతో దర్శనమిచ్చారు,అతని చూచి రమ్మని చేతులు చాచారు అప్పటి వరకు ఆజ్ఞా చక్రంలో దీప దర్శనం లాంటి చిన్న చిన్న అనుభూతులు తప్ప ఇట్లా గురువుల దర్శనం తెలియదు అతనికి ఆ తరవాత కొద్ది రోజుల మెడిటేషన్ లో ఎనర్జీ బాడీస్ – అందరూ ఒక ట్యూబ్ తో కనెక్ట్ అయినట్లు బంగారు రజను వ్యాపించడం కనబడేవి,కానీ 15,16 నిమిషాల కన్న మెడిటేషన్ కుదిరేది కాదు …కానీ వారి అక్కగారైన శృతకీర్తిగారి ఇంటికి అమ్మగారు విచ్చేసినపుడు – ఊర్ధ్వముఖంగా, అందంగా బంగారు రంగులో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో అమ్మగారు ధ్యానం చేస్తూ కనబడ్డారు…కానీ ఆ అనుభవం అతనికి ఆనందాన్ని, భయాన్ని కూడా కలిగించింది – అక్కడికి ఒక ఋషి వచ్చారు. భోగనాథ సిద్ధులు అయి ఉండవచ్చు – అన్న అనుభూతి కలిగింది – ఆ తరవాత గురు పౌర్ణమి ముందు ఆరు ,ఏడు నెలల కాలంలో శ్రీ లాహిరి మహాశయులు ఎక్కువగా దర్శనం ఇచ్చేవారు.కానీ వారెవరో తనకు ఎందుకు ఆయన కనిపిస్తున్నారు? అన్నది అతనికి అర్థం కాలేదు. ఒక యోగి ఆత్మకథ అతను చదవలేదు. వీరు నవ్వుతూ కనబడ్డా యుక్తేశ్వర్ గిరి గారు తీక్షణంగా చూస్తూ దర్శనమిచ్చారు.
కౌశిక్ అంత సరిగ్గా అప్పట్లో మెడిటేషన్ చేసే వారు కాదు. కౌశిక్ కు ఈ గురుదర్శనం గురించి అమ్మగారికి చెబితే “కాశీ వస్తున్నాడుగా! అందుకే” అనగానే కౌశిక్ కు చాలా కోపం వచ్చింది – అసలు తను కాశీ రావాలన్న నిర్ణయమే తీసుకోలేదు – అమ్మగారే నిర్ణయిస్తారా? అన్న ఉక్రోషం అది… అలా ఆనాడు కలిగిన ఆలోచనకే ఆ తరవాత చాలా రోజులు బాధపడ్డారు కౌశిక్ – కానీ కాశీ రావడం, ఆ మెడిటేషన్ లో “సారీ” అని గురువులకు చెప్పుకోవడము,ఉన్నట్లుండి కౌషిక్ గారి సూక్ష్మశరీరం అంతరిక్షంలోకి వెళ్లిపోవడము, బాబాజీ గారు విశ్వరూప దర్శనము, అమ్మగారు వచ్చి సున్నితంగా భుజము మీద తట్టి క్షమించానులే అన్నట్లు నవ్వడము, లాహిరీ మహాశయుల దర్శనముతో, ఉద్వేగం పట్టలేక ఈ “గురువులకు నా మీద ఎంత దయ?” అని ఏడ్చేశారు కౌశిక్.
ధ్యానంలో లాహిరి మహాశయుల ఇంట్లో కొంత మంది శిష్యులతో వారికి తను పాద సేవ చెయ్యడం అనుభవమయ్యింది – మరొకసారి ధ్యానంలో గంగానదిలో స్నానం చేస్తుండగా శ్రీ యుక్తేశ్వరగిరిగారు శ్రీ యోగానందగారు మాట్లాడుకుంటూ తనని చూపించడం అనే దృశ్యం చూశారు… మరొక రోజు శ్రీ రామకృష్ణ పరమహంస దర్శనము,తను శ్రీ వివేకానందుల శరీరంలో ఉండడము కనిపించింది – భయపడుతూ ఉండగా అమ్మగారు చిన్న దెబ్బతో మామూలు స్థితికి తీసుకువచ్చారు.
కాశీలో రోజూ అమ్మగారు సూక్ష్మ శరీరంతో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసే అధ్బుతదృశ్యం చూడగలిగారు కౌశిక్ బాబు – అమ్మగారినడిగితే – అవును అది నిజమేనని నిర్ధారించారు.అతనికి చిన్నప్పటి నుంచీ ఏదో బౌద్ధారామం ,మంచుకొండలు ,పసుపు పువ్వులు, అంతెవాసులు కనబడే
వారు …అక్కడ హాలులో పాలతో చేసిన ఆహారం తింటూ కనబడేవారు ..గురువులు ఏమిటి?! ఆ తిండి ఏమిటి?! అంత స్థాయిలో ఉండేవారు ఇలా తింటారా?! అన్న సందేహం ఉండేది…కారణం బహుశః పూజలు, వ్రతాలు,ఉపోషాలు అన్న సంస్కార పొర తొలగక పోవడం కారణం కావచ్చును.అక్కడ అమ్మగారు(అప్పుడు అమ్మగారు అని తెలియదు) ఛాయా మాత్రంగా కనబడేవారు – ఆ తరవాత మెడిటేటర్ అయిన అనిర్భన్ గారితో సంభాషణలో కొన్ని అర్థమైనా ..అమ్మగారు నవ్వుతూ ,అవును.. ఆ జన్మలో ఆ ఆరామంలో మీ ముగ్గురు ఉండేవారు..ఒకరు మీరు (అనిర్భన్)మరొకరు రాధగారు,మరి మూడవ వ్యక్తిని గుర్తు పట్టగలరా?! అన్నారట అనిర్భన్ తో …ఆ మూడో వ్యక్తి తనేనని తెలిసినప్పుడు నిర్ఘాంత పోయారు కౌశిక్ గారు..కాశీలో యజ్ఞం దగ్గరకు కుక్క వచ్చిందని వాలంటీర్ గా ఉన్న కౌశిక్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని పట్టుకుని బైటకు తెస్తే…అది పరుగెత్తుకు వెళ్లి శివుడి గర్భ గుడిలోకి వెళ్లి మాయమయ్యింది…ఆ తరవాత అమ్మగారి ఆహ్వానం మీద శ్రీ కాలభైరవ స్వామి యజ్ఞవాటికకు వచ్చారని తెలిసి, తనకు కలిగిన స్పర్శానుగ్రహానికి ఆనందించారు కౌశిక్ గారు
జీవన్ వంశీ గారి గృహప్రవేశం సందర్భంలో శ్రీ భోగనాథ సిద్ధులు అక్కడే ఉన్నారన్న అనుభూతి కలిగింది..వాలంటీర్స్ అమ్మగారిని కలవడానికి వెళ్ళినపుడు అక్కడ శ్రీ భోగనాథ సిద్ధులు శ్రీ బాబాజీ గారు అక్కడే ఉన్నారన్న అనుభూతి “ఫీలింగ్ ద ప్రెజెన్స్” కలిగేది.
శ్రీ కౌశిక్ గారి వంటి అధ్బుత స్థితిలో ఉన్న సుషుమ్న క్రియా యోగుల అనుభవాల వల్ల …పరమ గురువుల అనుగ్రహం ,జన్మ జన్మల అనుబంధము , ఆస్ట్రల్ ప్రొజెక్షన్,సూక్ష్మ శరీరాలతో గురువులు చేసే అద్భుతాలు ,శిష్యుల ఆస్ట్రల్ ట్రావెల్ లో జరిగే శక్తి ఛాలన – ఇలా చాలా విషయాల అనుభవం వలన మిగతా సుషుమ్న క్రియా యోగులకు వాళ్లకు జరిగే దర్శనాలకు నిదర్శనాలుగా నిజాలుగా అనుభూతి కలుగుతుంది మరి.

Share.

Comments are closed.