Welcome to the BLISSFUL journey

మాధవి మోక్ష అనుభవాలు

0

ఆధునికత అనే మిధ్యా ప్రపంచంలో ఉన్న వారికి మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచంతో మాత్రమే పరిచయం వుంటుంది కానీ…ఆ మాయను తప్పించే సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుంది .పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ వుంటాయి. ఆత్మలు వాటికుండే శక్తులు – ఈ సైన్స్ ను నాగరికత అనుకుని కొట్టిపారేస్తారు..
శ్రీమతి మాధవి గారు శ్రీ బాలాజీ గారి సహధర్మచారిని. బాలాజీ గారు ఎదురింటి జీవన్ వంశీ వారింటికి మెడిటేషన్ అంటూ వెళ్ళి సమయం గడపడం ఆవిడకి నచ్చేది కాదు. ఆమెకు చాలా దూరం ట్రాన్స్ఫర్ అవడం వలన ప్రయాణంలోనే అలసిపోయేవారు. ఈ మెడిటేషన్ టైం వేస్ట్ అనిపించేది.భర్త ఇంట్లో ఉండే కొద్ది సమయంలో ధ్యానం అంటూ కూర్చుంటే “ఫ్యామిలీ టైం” ఎప్పుడు అని విసుగు కలిగేది. ఒకసారి ఆమె కూడా చూద్దాం ఈ మెడిటేషన్ ఏమిటో అనుకుంటూ వారింట్లో అడుగు పెట్టారు ,వారింట్లో ఉన్న గురువుల ఫోటోలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అక్కడ గ్రూప్ మెడిటేషన్ లో ఇతర ధ్యానుల అనుభవాలు వింటున్నప్పు
డు ఉత్సాహం వచ్చింది..
ఆ ! మనకేం పెద్ద జరుగుతుందిలే అన్న అవిశ్వాసంగానే ధ్యానం ప్రారంభించారు.
అప్పుడప్పుడు చిన్న చిన్న విజన్సు గురు దర్శనాలు కలిగేవి విపరీతంగా ఉండే నడుం నొప్పి కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభమయింది.

కానీ చీకట్లో ఒంటరిగా ఉండాలంటే మటుకు ఆవిడకి చాలా భయమేసేది. లైట్ వేసుకునే
ధ్యానం చేసేవారు .ఉన్నట్లుండి ఒక రోజు చాలా భయంకరమైన అనుభవం ధ్యానంలో ఉండగా మాధవిగారికి జరిగింది. ఆమె ఇరువైపులా గురువులు ఉన్నారు.. మాధవిగారిలోనించి ఒక భయంకరమైన ఆత్మ బయటకు వెళ్లి పోయింది..,అది ఎంత భయంకరంగా ఉన్నదో ఆమె గమనించి ఇదేమిటి?! ధ్యానం చేస్తే ఇలాంటి నెగటివ్ ఎనర్జీ లు వెళ్లిపోతాయా?! అని ఆశ్చర్యపోయారు. ఆరోజు ఆమెకు తలంతా ఎనర్జీతో బరువెక్కింది అంతే ఆమెకు చీకటి భయం పోయింది .మంచి మెడిటేటర్ అయ్యారు. ఆమె రోజూ ఆదిభట్ల ట్రావెల్ చేయలేకపోతున్నాను నాకు తిరిగి గచ్చిబౌలి ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నారు. ఆఫీసులో ఎన్ని సమస్యలు ఉన్నా అమ్మగారి స్పీచెస్ వలన సహనం ,కర్మ సిద్ధాంతం నేర్చుకున్నారు. మిరాకిల్ ఏమిటంటే ఆమె కోరుకున్న ట్రాన్స్ఫర్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి తనని బాధ పెట్టిన వాళ్లకి ఆవిడ బాస్ అయ్యారు .ఇదంతా మెడిటేషన్ వల్లనే అని ఆవిడకి అర్థమయ్యి ఇప్పుడు జీవితాన్ని చాలా బాలన్స్ చేసుకుంటూ హాయిగా ఉన్నారు.
“ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటే ఉన్నాడు “అన్నట్లు గురువులు చక్కటి అనుభవాలతో వారి ఆత్మలతో అనుబంధం పెట్టుకొని జీవితాన్నే మార్చేస్తారు అన్న విషయం మాధవి గారి అనుభవం తెలుపుతుంది.. థాట్ ఫార్మ్స్ తో తీరని కోరికలతో తిరుగాడే ఆత్మల ఆవాహన ఎంత జరిగి థాట్ పొల్యూషన్ తెస్తుందో అన్న విషయాలు కొందరి ద్వారా గురువులు రుజువు చేస్తారు.

Share.

Comments are closed.