Welcome to the BLISSFUL journey

మురళీ వేపాడ గారు అనుభవాలు

0

చిన్నప్పటి సంస్కారాలు అలవాటయ్యి ,భక్తి మార్గాన్ని అనుసరించి,జపాలు,అష్టోత్తర శతనామాలు ,పూజలు,శ్లోకాలు దీక్షలు ప్రదక్షణలు ,పారాయణ వంటివి అలవాటైన మనం అందరము ఎప్పుడో ఒకప్పుడు అయ్యో!ఆ దేముడిని పూజించలేదు….అయ్యయ్యో ఈ అమ్మవారిని వదిలేశామేమిటి ? అని ధర్మ సంకటములో ఇరుక్కుని “శరణాగతి” స్థానంలో భయము,ఆందోళన,ఖంగారు ఎక్కువ అవడము చాలా మందికి అనుభవమే…మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?!
మురళీ వేపాడ గారు ఈ ప్రశ్న వ్యక్తీకరించగానే ,పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు నవ్వుతూ “49 రోజులు సుషుమ్న క్రియా యోగము చెయ్యండి మీకే పరిష్కారము అర్థమౌతుంది” అని దీవిస్తారు.బొంబాయికి అమ్మగారు విచ్చేసినపుడు మురళీ గారు ధ్యానం ఉపదేశంగా పొందారు.బొంబాయిలో ప్రతి 11 నెలలకు ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇల్లు వెతుక్కోవడము పెద్ద సమస్య అది తప్పించమని అమ్మగారిని ప్రార్థిస్తే , “ధ్యానం చెయ్యండి” అని అమ్మగారి ఆదేశము.ఇదేమిటి? ఏ సమస్యకు సమాధానం అడిగినా “ధ్యానమే మందు” అన్నట్లు చెపుతారేమిటి?! అనుకున్న మురళీ గారు అప్పటికి అమ్మగారు ఒక గొప్ప ధ్యాని మాత్రమే అనుకుంటున్న మురళీ గారు గురువు పట్ల పూర్తి నమ్మకము , సంపూర్ణ శరణాగతి ఇవేం ఏర్పడని పరిస్థితిలో ఉన్నారు.ధ్యానం ప్రారంభించగానే చెడు వాసనలు రావడం ప్రారంభించగానే ,భయపడి – ఇదేమిటి?! సుగంధాలు వస్తాయని విన్నాము ఈ విపరీతమేమిటని వారి భార్య ధ్యానం మానెయ్యమన్నారు.అమ్మగారు – పూర్వ జన్మలో విపరీతమైన కోపము ఉండేది ఇతనికి – అది గురువులు బైటకు తీసేస్తున్నారు – అని శలవిచ్చినప్పుడు – ధ్యానం ఆరుబయట చెయ్యమని దీవించినప్పుడు – ఆ మొదటి అనుభవాన్ని మర్చిపోలేదు మురళీ గారు.
49 రోజుల ధ్యానం తరువాత శృంగేరిలో గురుపూజ హోమం తరువాత బస్సులో గణపవరం విజయగారి అనుభవాలు వింటూ ఒంట్లో ఎనర్జీ ప్రవహించడము అనుభవములోకి వచ్చిన మురళీ గారికి పెద్ద వాంతి అయింది.ఉడిపిలో కృష్ణ పరమాత్మ సన్నిధిలో అమ్మగారు కనిపించగానే అమ్మగారి కళ్లల్లోకి చూస్తూ విపరీతంగా ఏడ్చారు మురళీ గారు.కానీ ,అప్పుడు అతనికే తెలియని ఒక అద్భుత ఆశీర్వచనము అతనికి దక్కిందని ప్రశాంతి అమ్మగారు చెప్పేవరకు మురళీగారికి తెలియలేదు.శ్రీ కృష్ణ సన్నిధిలో పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి కళ్ల నుంచి రెండు కాంతి రేఖలు(లేజర్ బీమ్స్ లాగా) మురళీగారి కళ్లలోకి పంపించబడ్డాయి…అది ఎవరికీ తెలియదు.ఉడిపి నుంచి ధర్మ స్థలి వెళ్లే దారిలో ఇన్నాళ్లు ధ్యానము చేస్తున్నా సంపూర్ణ శరణాగతి లేదే అని దుఃఖపడ్డారు మురళీగారు.అప్పుడు విజయగారు తన పక్కన కూర్చుని వారికి చెప్పవలసిన మెసేజ్ ను గురువులు పంపగా, అది మురళీగారు కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారని అమ్మగారు శలవిచ్చారు.గురుపూజ నుంచి వచ్చినప్పటి నుంచీ ఒళ్ళంతా విపరీతమైన మంటలతో బాధపడ్డ మురళీగారికి జబ్బు పరంగా ఏమీ లేదు అని తెలిసి,అమ్మగారిని అర్ధిస్తే ,”గురువులు మూడు జన్మల కర్మలు న్యూట్రలైజ్ చేశారు” అన్న సందేశము వినగానే పరమ గురువుల అనుగ్రహానికి కృతజ్ఞతతో కరిగిపోయారు మురళీ గారు.బొంబాయి రాగానే మురళీగారికి కంపెనీ క్వార్టర్స్ ఇచ్చి అతడు అమ్మగారితో విన్న వించుకున్న మొదటి సమస్య తీర్చబడింది.ఒకొక్క సుషుమ్న క్రియా యోగి పదిమంది కన్నా ధ్యానం నేర్పాలి అన్న అమ్మగారి ఆదేశము వలన ,అనుగ్రహము వలన వారింట్లోనే ధ్యానాన్ని నేర్పించే సేవా భాగ్యాన్ని పొందారు మురళీ గారు.గురు పౌర్ణమి నుంచి తెచ్చుకున్న “హోమం ఇటుకలు” ఎంత మహిమ గలవో ఎంత ఎనర్జీ ఫ్లో జరుగుతుందో అనుభవము మీద అర్థమైంది మురళీ గారికి.
అంతకు ముందు ప్రతి సమస్యకూ తనకు సానుకూలంగా పరిష్కారం కావాలనుకునే వీరు – ఏది జరిగినా మన మంచికే గురువులు ఏమిచ్చినా “ప్రసాదమే” అన్న గొప్ప స్థితికి వచ్చారు…1700 మంది ఉన్న స్కూలులో ధ్యానం చెప్పి , ఇలా అందరికీ ఈ ధ్యానము నేర్పించటమే మనము అమ్మగారికి ఇవ్వగలిగిన గురు దక్షణ – అన్న స్థితికి ఎదిగిన మురళీ గారి అనుభవాలు ప్రతి సుషుమ్న క్రియా యోగికి యోగ పాఠాలు లాంటివి.

Share.

Comments are closed.