Welcome to the BLISSFUL journey

పౌర్ణమి యొక్క ముఖ్యత్వము

0

పౌర్ణమి అనగా ఏమి ?

సంస్కృతంలో పౌర్ణమి అనగా “పూర్ణ చంద్రుడు” అని అర్థము.పూర్ణ చంద్రుడుని కలిగిన రోజును పూర్ణిమ అని ఉత్తరభారత దేశంలో, పౌర్ణమి లేదా పౌర్ణిమ అని దక్షిణ భారత దేశంలో పిలుస్తారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజును శుభదినంగా భావిస్తారు. చంద్రమానము ప్రకారము ఈ పౌర్ణమి ప్రతినెలా వస్తుంది. కొన్నిసార్లు పౌర్ణమి ఒక నెలలో రెండు సార్లు వస్తుంది.దీనినే “బ్లూ మూన్ ” అని కూడా అంటారు. నెలలో రెండు పౌర్ణములు వచ్చిన సంవత్సరము 13 పౌర్ణములు అవుతాయి.

పౌర్ణమి సమయంలో చంద్రుడు సంపూర్ణంగా, కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. పూర్ణ చంద్రుడు అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపచేయడానికి ప్రతీక. ఈ శుభదినాన చంద్రుడు భూమి చుట్టూ తిరిగి ఒక చక్రాన్ని పూర్తి చేస్తాడు.ఇది మనిషి జీవితంలో ఒక అధ్యాయాన్ని ముగించి మరొక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లుగా భావిస్తారు.

పౌర్ణమి అనేది ఒక నెలను రెండు సమాన చంద్రదశ పక్షాలుగా విభజిస్తుంది.శుక్ల పక్షము లేదా వృద్ధి చెందుతున్న దశ మరియు కృష్ణ పక్షము లేదా క్షీణిస్తున్న దశ.శుక్ల పక్షములోని 15 వ రోజు పౌర్ణమి.శుక్ల పక్షములో చంద్రుడి యొక్క కాంతి పెరుగుతూ ఉంటుంది .కృష్ణ పక్షములో చంద్రుడి కాంతి తగ్గుతూ ఉంటుంది.

చంద్రుని యొక్క ముఖ్యత్వము :-

మన వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు ఒక ముఖ్యమైన గ్రహము మరియు మానవుని యొక్క మనస్సును శాసించే గ్రహంగా భావిస్తారు. మనము భూమి నుండి  చంద్రుడిని చూస్తున్నప్పుడు వివిధ దశలలో మార్పు చెందుతూ కనిపిస్తుంది. అదే చంద్రుడు వృద్ధి చెందుతున్న దశ మరియు క్షీణిస్తున్న దశ. ఈ దశలు మానవుని యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపిస్తాయి. శాస్త్రీయంగా గమనించినపుడు, పౌర్ణమి రోజున చంద్రుని యొక్క గురుత్వాకర్షణ సముద్రపు అలల పై మరియు మానవుల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పౌర్ణమి రోజున ఉపవాసము చేస్తే మానవ శరీరంలోని ఆమ్లమును నియంత్రింపజేస్తుంది , జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు మెదడు యొక్క క్రియాత్మక సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది.

పౌర్ణమి యొక్క ముఖ్యత్వము :-

పౌర్ణమి రోజున మన దేహంలో ఉండే ఇడా ,పింగళ మరియు సుషుమ్న ఈ మూడు ప్రధానమైన నాడులు సంతులనము చెంది కుండలిని శక్తి ఉత్తేజితమై సహస్రార చక్రము వరకు చేరుకుని,మనల్ని దైవత్వానికి అనుసంధానము చేస్తుంది.

ఇడా నాడిని చంద్రనాడి అని కూడా అంటారు. శరీరంలో వెన్నెముకకు ఎడమ వైపు ఉండి స్త్రీత్వ లక్షణాలకు ఆపాధించబడి ఉంటుంది. పింగళ నాడిని సూర్యనాడి అని అంటారు మానవుని శరీరంలో వెన్నెముకకు కుడి భాగంలో ఉండి పురుష లక్షణాలకు ఆపాదించబడి ఉంటుంది. సుషుమ్న నాడి మానవుని శరీరంలో వెన్ను భాగంలో మధ్యస్తంగా  ఏడు చక్రాలు గుండా ప్రయాణిస్తుంది.

పౌర్ణమి రోజున భూమి యొక్క గురుత్వాకర్షణశక్తి  అధికంగా ఉండి మానవుని పై అత్యంత సానుకూల ప్రభావం చూపిస్తూ , ఘనమైన స్థిరత్వాన్ని కలుగజేస్తూ, మెరుగైన శక్తిని అందిస్తూ శరీరము మరియు మనస్సు మధ్య అంత్యంత సమతుల్యతను కలిగిస్తుందని విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది.

హిందూ క్యాలెండర్ లో ప్రతి పౌర్ణమి ముఖ్యమైన పండుగతో ముడిపడి ఉంటుంది . ఈ పౌర్ణమి శుభదినాన పూజ ఉపవాసం మరియు ధ్యానము అత్యంత గాఢంగా చేస్తారు.పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం పౌర్ణమి వ్రతం అంటారు.పౌర్ణమి వ్రతం సూర్యోదయం నుండి చంద్రుడిని చూసే వరకు ఉంటుంది.
  పౌర్ణమి సంపూర్ణత్వం, సమృద్ధి మరియు శ్రేయస్సును కూడా సూచిస్తుంది. అందుకే పౌర్ణమి సమయంలో పూజించడం మరియు ధ్యానం చేయడం వలన తెలివి తేటలు పదును పెరుగుతాయి , ఆలోచన స్పష్టత పెరుగుతుంది మరియు అన్నీ ఒత్తిడులు మరియు ఉద్రిక్తతలు తొలగిపోతాయి.
పౌర్ణమి రోజున ముఖ్యంగా మనోహరమైన చంద్ర దర్శనం కలుగుతుంది మరియు ఆ రోజు చంద్ర దేవున్ని ధ్యానించడం వలన చంద్రదేవుడు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది.

రాబోయే పౌర్ణమి
తదుపరి శుక్లపక్ష పౌర్ణమి 19 అక్టోబర్ 2021 మంగళవారం రోజున రాత్రి 7:03 నిమిషాలకి మొదలై 20 అక్టోబర్ రాత్రి 8:26 నిమిషాలకి ముగుస్తుంది . ఈ పౌర్ణమిని “ఆశ్విన పౌర్ణమి” అంటారు.

హిందూ క్యాలెండర్ నెల అశ్వినలో వచ్చే పౌర్ణమిని శరద్ పూర్ణిమ మరియు కోజగిరి పౌర్ణమి అని కూడా అంటారు.ఇది భారత దేశంలోని ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు.మరియు లక్ష్మీ దేవిని పూజించడానికి అంకితం చేయబడింది.వాల్మీకి జయంతిని కూడా అశ్విన పౌర్ణమి నాడు జరుపుకుంటారు.

నెల వారీగా పౌర్ణమి జాబితా క్రింద ఇవ్వబడింది

జనవరి – పౌష పౌర్ణమి.

ఫిబ్రవరి -మాఘ పౌర్ణమి

మార్చి -ఫాల్గుణ పౌర్ణమి

ఏప్రిల్ – చైత్ర పౌర్ణమి

మే – వైశాఖ పౌర్ణమి

జూన్ -జ్యేష్ఠ పౌర్ణమి

జూలై – ఆషాఢ పౌర్ణమి

ఆగస్టు -శ్రావణ పౌర్ణమి

సెప్టెంబర్ – మధు పౌర్ణమి లేదా భాద్రపద పౌర్ణమి

అక్టోబర్ -అశ్విన పౌర్ణమి

నవంబర్ – కార్తీక పౌర్ణమి

డిసెంబర్ – మార్గశీర్ష పౌర్ణమి

Share.

Comments are closed.