Welcome to the BLISSFUL journey

రామచంద్ర రాజుగారు చింతలపాటి అనుభవాలు

0

గణపవరం విజయలక్ష్మి గారు,రామచంద్ర రాజు గారి కుటుంబం పది సంవత్సరాలుగా పూర్తి శరణాగతి తో విశ్వాసంతో సుషుంన క్రియా యోగ ధ్యాన సాధన చేస్తున్నారు.రాజుగారు మొదటినుంచి ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు .చాలా మితంగా ఇంటి భోజనం మాత్రమే చేస్తారు. ఎప్పుడూ కూడా వారిలో అలసత్వం కానీ బద్దకం కానీ కనిపించదు.75 సంవత్సరాలు పైబడిన వారు మన యూత్ వొలంటేర్ తో పోటీపడి మరీ సర్వీస్ చేస్తారు.వారు జూన్ 16,2019 ఆదివారం నాడు హైదరాబాద్లోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసులో జరిగే Sunday గ్రూప్ మెడిటేషన్ కి బయలుదేరారు.వాస్తవానికి వారికా రోజు ఉదయం నుండి ఛాతీలో నొప్పి ఉన్నా దానిని పెద్దగా పట్టించుకోకుండా ధ్యానానికి బయలుదేరారు అయతే దారిలో వారు తన purse మరియు కళ్ళజోడునీ మరచిపోయిన విషయాన్ని గ్రహించి తిరిగి ఇంటికి వెళ్ళారు.అలా ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఇబ్బందిగా అనిపించింది.బాత్రూంకి వెళ్ళగా సడెన్గా పెద్ద విరోచనం ఐపోయి ఒళ్లంతా చెమట లతో తడిసి ముద్దయి బాత్రూం బయట కుప్ప కూలి పోయారు అక్కడే పెద్ద వాంతి కూడా అయ్యి స్పృహ తప్పి పడిపో యారు అప్పుడు వారికి ప్రాణం పోతున్న సంగతి స్పష్టంగా తెలిసింది.వెంటనే గురువులకు నమస్కరించు కున్నరు అంతే సుడిగలిగా మహా అవతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చి వారి ప్రాణాన్ని శరీరంలోకి మళ్లీ ప్రవేసింపచేసారు. వెంటనే రాజుగారికి నొప్పి బాధ తగ్గిపోయాయి క్రొత్త ఉత్తేజం వచ్చినట్టు అనిపించింది కానీ వారు బయట ప్రపంచానికి మాత్రం స్పృహ లేక పడి ఉన్నటే కనపడ్డారు . కుటుంబ సభ్యులు వారినీ పరిస్తితిలో చూసి చాలా గాబరా పడ్డారు ఎప్పుడూ చలాకీగా ఆరోగ్యంగా వుండే రాజుగారు స్రృహలేని స్థితిలో చూసిన కుటుంబ సభ్యులు అంబులెన్సు నీ పిలవాలి అని కూడా వారికి తట్టక ప్రైవేట్ టాక్సీ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు.రెండు గంటలసేపు ఎటువంటి ఫస్ట్ అయిడ్ సహాయక చర్యలు లేకుండా రాజుగారు హాస్పిటల్ కి చేరుకున్నారు. డాక్టర్స్ రాజుగారిని పరీక్షించి ఇంత విషమ పరిస్థితిని వారు రెండు గంటలసేప తట్టుకుని ఎలా బ్రతికి ఉండగలిగారు నిజంగా మేము నమ్మలేక పోతున్నాను అని అన్నారు.వెంటనే వారికి Angiogram చేసి స్టుంట్ వేసి వైద్యం పూర్తి చేశారు. ఇంత జరిగినా ఐసిసియా లో ఉన్న వారిని చూడడానికి విజయ లక్ష్మి గారిని అనుమతించ గా రాజుగారు ఆవిడని చూసి మొట్టమొదట పలికిన వాక్యాలు ఏంటి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసుకి వెళ్ళలేదు ధ్యానానికి వెళ్ళ లేదా.మనం ఎక్కడ ఉన్నాము అని అడిగారు. అంత శ్రద్ధ భక్తి శరణాగతి ఉంది కాబట్టే గురువులు వారికి పునర్ జన్మని ప్రసాదించారు.ఎందుకంటే వారు ఇంకా ఏంతో కాలం మన గురు మాత ఐన ఆత్మా నందమయి మయి అమ్మగారి సమక్షంలో వారి ప్రేమను,కరుణను,వాత్సల్యాన్ని అనుభూతి చెందుతూ సుషుమ్ న క్రియా యోగ ధ్యాన సాధన ను చేసుకునే ఆ అవకాశాన్ని వారికి ఈ పునర్జన్మ ద్వారా ప్రసాదించారు.రాజుగారు ఆ రోజు బ్రతికి ఉండడం ఒక మెడికల్ మిరాకిల్.వారికి సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఎంత తీవ్రంగా అంటే వారి శరీరంలో oxigen శాతం చాలా క్షీణించింది దానిని hypoxia అంటాము సివియర్ hypoxic state logastro intestinal attack అంటే అన్నవాహిక సడెన్గా ఖాళీ అయిపోతుంది కడుపులో ఉన్నదంతా వాంతి రూపంలోనూ పేగులలో ఉన్నదంతా మోషన్ అంటే వెరేచనం రూపంలోనూ సడెన్గా బైటికి వస్తుంది అలా సడెన్గా అన్నవాహిక మొత్తం evaquate అయినప్పుడు బీపీ నాన్ rikordable స్టేట్ కి పడిపోయి బ్రైన్ కి గుండె కి కిడ్నీ కి రక్త ప్రసరణ ఆగిపోయి మనిషి ప్రాణం విడుస్తారు.రాజుగారికి కూడా అదే జరిగింది కేవలం సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన సంపూర్ణ విశ్వాసంతో చేస్తున్నారు కాబట్టే గురువుల దయా హృదయులై వారికి పునర్జన్మ ప్రసాదించారు.మన గురువులు ఘటనా ఘటన సమర్థులు వీరి అనంత లీలల లో రాజుగారి వృత్తాంతం ఒకటి ఇది ఒక గొప్ప మెడికల్ మిరాకిల్.

Share.

Comments are closed.