Welcome to the BLISSFUL journey

గూడవల్లి రత్తయ్య గారు అనుభవాలు

0

గూడవల్లి రత్తయ్యగారు నవంబర్ 2016 వ సంవత్సరం గుంటూరులో సుషుమ్న క్రియా యోగ దీక్ష స్వీకరించి క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు.వీరు పౌర్ణమి ధ్యానం క్లాసులకు కూడా క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నారు.వీరు2012 వ సంవత్సరం నుండీ ఒక క్లిష్టమైన నరాల వ్యాధితో బాధ పడుతూ ఉండేవారు.మొదట కను రెప్పలు ఆగకుండా అప్రయత్నంగా కొట్టుకుంటూ ఉండేవి. దీనిని బ్లఫరో స్పాజం అంటాము. దీని వల్ల చూపు చాలా ఇబ్బంది అవుతుంది. కంటి నిపుణులను సంప్రదించారు కానీ ఏమీ గుణం చూపక పోవడంతో వారు న్యూరాలజిస్ట్ కి చూపించు కున్నారు.గుంటూరులో ఉన్న న్యూరాలజిస్ట్ లు అందరినీ సంప్రదించారు. విజయవాడలోని హోమియో ఇంటర్నేషనల్ ,అలానే తెనాలిలోని ఆయుర్వేదం మందులు తరువాత బెంగలూరు లోని నింహన్స్ ఇన్స్టిట్యూట్ మరో రెండు హాస్పిటల్స్ ఇలా ఎంతమంది స్పెషలిస్ట్ లను సంప్రదించిన ఫలితం లేకపోయింది.ఒక సారి బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే అది వికటించి ముఖం పైన బొబ్బలు వచ్చి బాధ పడ్డారు. బెంగళూర్ లోని ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు సెకండ్ ఒపీనియన్ కోసం మణిపాల్ హాస్పిటల్స్ కి వెళ్తే వారు ఆపరేషన్ చాలా ప్రమాదకరం అని వారించారు.ఇలా ఉండగా వ్యాధి ముదిరి మెడ కండరాలకు వ్యాప్తి చెందడం వల్ల మెడ ఒక పక్కకి వంగి పోయింది దీనిని టోర్టీకోలిస్ అంటారు.దవడ కండరాలకు వ్యాప్తి చెందడం వల్ల ఆహారం తీసుకోవడం,నమలడం,మింగడం కష్టమైంది.కెనడా నుంచి వచ్చిన డాక్టర్స్ ,అమెరికా నుంచి వచ్చిన డాక్టర్స్ వీరిని పరీక్షించి ఎటువంటి వైద్యము చెయ్యలేక పోయారు. అమెరికా డాక్టర్స్ ఆపరేషన్ చేస్తాము అమెరికా రమ్మని చెప్పారు దానికి సుమారు 75లక్షలు వరకు ఖర్చు అవుతుందని అన్నారు. రత్తయ్యగారు సెర్వికల్ డిస్టోనియా విత్ బ్లఫరో స్పాజమ్ మరియు ఓరో మాండిబులార్ డిస్టోనియా అనే ఒక నరాల వ్యాధితో బాధ పడుతున్నారు.ఈ వ్యాధికి చాలా సార్లు కారణం తెలీదు ఏదో చాలా కొద్ది మందిలో మాత్రం జన్యు లోపము వల్ల కానీ లేదా మెదడులో కణితి వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.మెదడులో కణితి వల్ల వచ్చినట్లయితే ఆపరేషన్ వల్ల పూర్తిగా నయం చెయ్యచ్చు లేని పక్షంలో ఈ వ్యాధికి క్యూర్ లేదు రత్తయ్య గారికి వచ్చిన ఈ వ్యాధికి కూడా ఏటువంటి కారణము తెలీదు అందుకే ఎంత మంది వైద్యులకి చూపించిన ఫలితం లేకపోయింది.అరవై,డబ్బై ఏళ్ల వయసులో అన్నం తినలేక ఏంతో శారీరక మానసిక బాధని కూడా అనుభవించారు.ఈ క్రమంలో ఒక రోజు వారి అదృష్టవశాత్తు గుంటూరులో వారు నివసించే అపార్ట్మెంట్ లో ఉంటున్న రమాదేవిగారి ద్వారా సుషుమ్న క్రియ యోగ సాధన మొదలు పెట్టారు.ఆ రోజు నుంచి క్రమేపీ తన శారీరక బాధ తగ్గడం గమనించారు ఒక రోజు ధ్యానం చేసిన తరువాత లేచి చూస్తే పక్కకి వాలి ఉండే మెడ చాలా మటుకు నిటారుగా ఉండడం గమనించారుఎన్నో సంవత్సరాలుగా బాధ పడుతున్న టర్టికాలిస్ లో మంచి ఫలితం కనిపించింది వారి సంతోషానికి అవధులు లేవు.తరువాత ఒక రోజు ధ్యానం లో ఓంకారం చేస్తూ ఉండగా నోటి నుండి ఏదో బయటికి పోయినట్టు అనిపించింది అంతే ఇరవై నెలలుగా అన్నము తినలేని వారు ఆ రోజు నుండి తృప్తిగా భోజనం చేయగలుగుతున్నారు.ఇప్పుడు వారు ఏంతో ఆనందంగా జీవిస్తున్నారు.గూడవల్లి రత్తయ్య గారి ఎక్స్పీరియన్స్ మన పరమ గురువులైన భోగనాధ మహర్షుల వారు మహా అవతార్ బాబాజీ గారు మన గురు మాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అద్భుత లీలలు ,మాటలకు అందని అతీతమైన నిర్వచనాలుగా రుజువు చేసింది.

Share.

Comments are closed.