Welcome to the BLISSFUL journey

సత్యశుభ అనుభవాలు

0

వైజాగ్ శిరీషగారి చెల్లెలు సత్యశుభ అమెరికాలో ఉంటారు.వీరి కుటుంబమంతా గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి పట్ల అనన్య భక్తి భావంతో ఉండి పూర్తి విశ్వాసంతో సుషుమ్న క్రియా యోగ సాధన చేసుకుంటారు. డాక్టర్స్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాకమునుపే తనకి గర్భసంచిలో నిలువుగా కండ పెరిగి ఉన్నట్లు గుర్తించారు దీనినే యుటిరైన్ సెప్టమ్ అంటారు. ఆపరేషన్ ద్వారా దానిని తొలగించుకోవాలని సూచించారు. తొలి కాన్పు కూడా కాకుండానే యూట్రస్ కి ఆపరేషన్ ఆ అని వారి తల్లిగారు గాబరా పడటం వలన నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం చేసింది.తీరా నిర్ణయం తీసుకొని డాక్టర్ ని కలిసినప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది.యుటిరైన్ సెప్టమ్ ప్రెగ్నెన్సీ చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ,
సెప్టమ్ మందమైన పొరలా ఉండి యుటిరస్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఉంచుతుంది. దీని వల్ల యుటిరైన్ కేవిటీలో స్పేస్ తగ్గిపోయి పిండం ఎదుగుదలకు అవరోధం కలిగిస్తుంది. డాక్టర్స్ తనకి చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఎప్పుడైనా ఏ దశలో అయిన గర్భస్రావం అవచ్చు అని బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం ఉంటుంది అని అలానే ప్రసవం కూడా నార్మల్ గా అవదు అని చెప్పారు. తను భయపడుతూ తన రిపోర్ట్స్ అన్నీ అక్క గారు అయిన శిరీష గారికి పంపించారు. వారు అమ్మగారి ఆజ్ఞతో నాకు చూపించారు. నేను కూడా అమెరికన్ డాక్టర్స్ చెప్పిందే ధ్రువ పరిచాను. సత్యశుభగారు అంతా గురుమాత ఆత్మానందమయి అమ్మగారి పైన భారం వేసి గురువు మీద ఏ మాత్రం నమ్మకం సడలకుండా పూర్తి విశ్వాసంతో సాధన సాగించారు. తనకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నెలలు నిండి సంపూర్ణ ఎదుగుదలతో ఆరోగ్యంతో ఉన్న పండంటి పాపకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ 9 నెలలు ఒక ఎత్తు అయితే డెలివరి నిజంగా మిరాకిల్ అండి. అసలు సెప్టేట్ యుటరస్ ప్రెగ్నెన్సీ అంటేనే నెలలు నిండా కుండానే డెలివరీ అవాలి. కానీ తనకి పూర్తిగా నెలలు నిండాయి అలానే,నెలలు నిండకుండా డెలివరీ అయినా కూడా తప్పకుండ ఆపరేషన్ తోనే అంటే సీ – సెక్షన్ తోనే డెలివరీ చేయాల్సి వస్తుంది. కానీ సత్యశుభగారి విషయంలో మాత్రం పూర్తి నెలలు నిండిన తర్వాత కూడా ఎంతో ఈజీగా నార్మల్ డెలివరీ అయింది.
మనం ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి డెలివరీకి తను హాస్పిటల్ కి తనతో పాటు గురువుల ఫోటోని కూడా వెంట తీసుకెళ్ళింది. డెలివరీ రూమ్ సిబ్బందిని వెళ్ళినపుడు తనతోనే ఉంచుకోవటానికి పెర్మిషన్ తీసుకున్నారు. వారు తన డెలివరీ చాలా కాంప్లికేటెడ్ కాబట్టి ఏటువంటి అభ్యంతరం చెప్పకుండ గురువుల ఫోటోని తనతో ఉంచు కోనిచ్ఛారు. అలా సత్య శుభ గురుమాత ఆత్మానందమయి అమ్మగారి సమక్షంలోనే డెలివరీ అయింది కాబట్టి అంత సులువుగా నార్మల్ డెలివరీ అయిపోయింది. అపుడు హాస్పిటల్ సిబ్బంది తనతో ఇలా చేప్పారంట, శుభగారు నెక్స్ట్ డెలివరీకి వచ్చేటపుడు మీరు తప్పకుండా మర్చిపోకుండా మీ గురువుల ఫోటోని వెంట తీసుకురావాలి అని, ఇది నిజంగా ఒక గొప్ప మెడికల్ మిరాకిల్ అండి శుభగారి విషయంలో జరిగింది మాత్రం మామూలు విషయం కాదండీ అద్భుతం అద్భుతమైన లీల.
సెప్టేట్ యూటిరస్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ,దీనిని హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాము. నిలువులో పొర ఉండటం వల్ల చాలాసార్లు మొదటి మూడు నెలలలోపే అబార్షన్ అయిపోతుంది. అపుడు నార్మల్ కన్న ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది అంటే రక్త స్రావం ఎక్కువగా అవుతుంది. అలానే ఆ టైంలో యుటరస్ క్లీన్ చేసేటపుడు సెప్టమ్ కు కానీ అంటే అడ్డుగా ఉన్న గోడ పొరకి కానీ లేకపోతే యుటరస్ కి కానీ దెబ్బ తగిలి హోల్ పడవచ్చు. ఒకవేళ అలా హోల్ పడితే మాత్రం తల్లి ప్రాణానికే ముప్పు ఉంటుంది. వెంటనే పెద్ద ఆపరేషన్ చేసుకోవలసి వస్తుంది. మరి చాలా సార్లు మూడు నెలలు నిండి గనక కాన్పు ముందరకు వెళితే ఆరవ నేలలోనో, ఏడో నెల్లోనో, ఏనిమిదివ నెలలోనో కాన్పు అయిపోతుంది. అలా నెలలు నిండకుండా కాన్పు అయిన కూడా వీరికి నార్మల్ డెలివరీ అవదు, వీరికి తప్పకుండ సీ – సెక్షన్ చేసే డెలివరీ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే నిలువులో పొర ఉండటం వల్ల బిడ్డ పొజిషన్ లో కూడా మార్పు ఉంటుంది. ఎదురు కాళ్లతో కానీ లేదా అడ్డంగా కానీ బిడ్డ ఉంటుంది.కాబట్టి నార్మల్ డెలివరీ అవడం చాలా కష్టం. మరి గర్భసంచిలో నిలువుగా పొర ఉండటం వలన బిడ్డకి ఎదగడానికి ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండి బరువు కూడా చాలా తక్కువగా పుడతారు.అలానే ఒకవేళ మాయ ఆ అడ్డుపొర మీద అంటే సెప్టమ్ మీద పెరిగితే కనక తొమ్మిది నెలలు నిండకుండానే మద్యలోనే బ్లీడింగ్ అవుతుంది. దీనిని ఆంటీ పార్టమ్ హీమరెజ్ అని అంటాము. అలా గనక అయితే బిడ్డకే కాదు తల్లికి కూడా ప్రాణహాని ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చాలా ఎమర్జెన్సీగా సీ – సెక్షన్ చేయాల్సివస్తుంది అలానే రక్తం కూడా ఏక్కించాల్సి ఉంటుంది. సీ- సెక్షన్ చేసినా కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఎంటంటే మాయ తొలగించినపుడు ఆ సెప్టమ్ మీద నుంచి బ్లీడింగ్ ఆగకుండా అయిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో తల్లిని కాపాడటానికి గర్భసంచినే తొలగించాల్సివస్తుంది దీనిని సిజేరియన్ హిస్ట్రెక్టమి అంటారు.మరి చూడండి ఇన్ని కాంప్లికేషన్స్ అడుగడుగునా ఉన్న సెప్టేట్ యుటరస్ ప్రెగ్నెన్సీలో మన సత్యశుభ గారికి ఒక్క కాంప్లికేషన్ కూడా లేకుండా పూర్తి నెలలు నిండి నార్మల్ గా ఈజీగా డెలివరీ అవడమే కాకుండా పూర్తి ఎదుగుదలతో సంపూర్ణ ఆరోగ్యంతో పండంటి పాపను తను పొందింది. గురువులు ప్రత్యక్ష పరబ్రహ్మం అయిన ఆత్మానందమయి అమ్మగారి అద్భుత లీల కాక మరేమిటి చెప్పండి ఇంత అద్భుతం కేవలం మన ఆత్మానందమయి అమ్మగారి కరుణతో,ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది అండి.

Share.

Comments are closed.