Welcome to the BLISSFUL journey

శాంతి కంచర్ల అనుభవాలు

0

సుషుమ్న క్రియా యోగులకు అతి ముఖ్యమైనవి ధ్యానము,భావము,విచారణ. సాధారణంగా ధ్యాన మహిమ గురించి తెలిసిన చాలా మంది భావము,విచారణ గురించి శ్రద్ధ వహించరు. కానీ ఈ మూడింటిని మన సుషుమ్న క్రియా యోగుల్లో సమాన ప్రతి పత్తి ఇచ్చి గౌరవించి,అర్థం చేసుకుని ఆచరించే వారికి అనుభవాలు అనుసరణీయాలు.అటువంటి వారిలో U K కి చెందిన శాంతిగారు ముఖ్యులు.వారు ఈ యోగంలో ప్రవేశించినప్పుటి నుంచి భావంతో ఉండడము,తనను తాను విచారణ చేసుకోవడం చేసేవారు.పెళ్లి అయిన తరువాత భర్తతో UK వెళ్ళిన శాంతిగారు భర్త ఉద్యోగరీత్యా స్పెయిన్ లో ఉండేవారు.కానీ కొన్ని వీసా సమస్యల వల్ల శాంతి గారు ఒంటరిగా uk లో ఉండి పోవలసి వచ్చింది అప్పటికి ఆమె గర్భవతి.మొదటి కాన్పు ఏమి తినాలో ఎలా ఉండాలో తెలియక పోవడం,ఒంటరి తనము, గాస్ట్రిక్ ప్రాబ్లమ్ వలన ఏమీ సహించకపోవడం ఇటువంటి ఈతి బాధల మద్య డాక్టర్ చెకప్ కి వెళ్లినప్పుడు గైనకాలజిస్ట్ నీకు ఫైబ్రాయిడ్ ఉన్నది నీ బేబీ కన్నా ఫైబ్రాయిడ్ పెద్దగా ఉంది. నువు బాగా మంచి ఆహారం తినాలి అని వైద్య పరమైన సూచనలు చేస్తే బిత్తర పోయారు శాంతి గారు.కారణం ఆవిడకి అప్పటికి ఫైబ్రాయిడ్స్ గురించి అంత జ్ఞానం లేదు మరి కానీ పాలు కొంచం ఆహారం తప్ప తినలేని శాంతి గారికి రెండవ చెకప్ లో డాక్టర్ నీ బిడ్డ కన్నా హైబ్రిడ్ పెరిగిపోయింది. బిడ్డ సరిగ్గా పుడుతుందని గ్యారంటీ ఇవ్వలేము అన్నపుడు ఒంటరిగా ఉన్న శాంతి గారు భయపడి పోయారు.ఓంకారము,ధ్యానము ఇవే తోడు కానీ ఆమె సుషుమ్న క్రియా యోగిని కదా! అమ్మగారు నా సంగతి శ్రద్ధ తీసుకుంటారు అన్న శరణాగతితో ధ్యానము, విచారణ, భావము ఈ మూడింటి పైనే ధ్యాస పెట్టారు.
ఒక నెల లోపల ఆవిడ వీసా ప్రాబ్లెమ్ తీరింది.మూడవ చెకప్ లో బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని ఆశ్చర్యంగా చెప్పారు డాక్టర్లు, గాస్ట్రిక్ సమస్య కూడా దారికి వచ్చింది.డెలివరీ కూడా చాలా సులభంగా జరిగి చాలా చాలా ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వగలిగారు శాంతిగారు.నాకు అన్నీ అమ్మగారే,గురువులే అంటారు శాంతి.పాప చిన్నగా ఉండగా వారి భర్త వేరే ఊరిలో వారానికి ఐదు రోజులు ఉద్యోగ రీత్యా వెళ్ళవలసి వచ్చినప్పుడు బిడ్డతో శాంతిగారు Uk లో ఉండిపోయారు.ఒంటరితనం భయపెట్టేది ధ్యానమే తోడు మరి, ఒక రోజు అర్ధరాత్రి వేళ శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. తదేకంగా వారినే చూస్తూ నిద్రలోకి ఒరిగిన శాంతిగారికి నీకు భయం వేసిందిగా…అందుకే బాబాజీగారు తోడున్నారు అని అమ్మగారు చెప్పినప్పుడు కృతజ్ఞతతో ఆనందంతో పులకించి పోయారు శాంతిగారు.దుర్గాష్టమి నాడు శాంతిగారి పుట్టిన రోజు.నవరాత్రులలో చాలా భావంతో, భక్తితో,పూజ చేసి పార్వతి,పరమేశ్వరుల పాదాలకు నమస్కారము చేసి దీవెనలు పొందే శాంతిగారు పుట్టినరోజు నాడు నన్ను ఆశీర్వదించు శివయ్యా! అని కోరుకోగానే పార్వతీ పరమేశ్వరుల రెండు జతల పాదాలు ఒక పెద్ద బంగారు పాదంగా కాంతులొలుకుతూ దర్శనమివ్వడంతో పులకించి పోయారు శాంతిగారు,నిన్ను శివయ్య అనుగ్రహించారు అని అమ్మగారు అనుగ్రహ భాషణలో చెప్పినపుడు మరింత ఆనందించారు.ఆరేళ్ల కాలం ఉద్యోగ అన్వేషణలో ఉన్న శాంతిగారికి ఇంక ఉద్యోగం రాదేమో ఉద్యోగం అవసరమే మరి ఎట్లా? అని అన్వేషణలో బాధగా ధ్యానం చేస్తూంటే ఒక గుహలో ఒక మహా యోగి దర్శనము ఇచ్చి దీవించగానే చాలా మంచి ఉద్యోగం ప్రాప్తించింది.వారే శ్రీ భోగనాథ మహర్షులు అని అమ్మగారు సెలవిచ్చినప్పుడు గురువుల దయకు మరొకసారి కృతజ్ఞులు అయిపోయారు శాంతి గారు.
శాంతిగారి భావము,విచారము,ధ్యానము ఆమెకు ఎన్నో అధ్బుతమైన అనుభవాలు ఇచ్చింది.

Share.

Comments are closed.