Welcome to the BLISSFUL journey

శిరీష రుద్రరాజు అనుభవాలు

0

పరమాధ్బుత మహోన్నతులైన గురుపరంపరతో శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారి అద్భుత క్రమశిక్షణా పర్యవేక్షణతో రూపొందించబడిన శ్రీ దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ కు “సెక్రటరీ” పదవిలో ఉన్న శిరీషగారు ఎటువంటి ఆధ్యాత్మిక పయనంలో ఉండి వుంటారా?! ఎందుకని ఆవిడను ఆ ఉన్నత పదవికి గురువులు ఎన్నుకున్నారా?! అన్న విషయం చాలా మందికి జిజ్ఞాస కలిగించవచ్చును… ఇటువంటి పదవులు సుస్థిరమవ్వాలంటే కేవలము వినయపూర్వకసేవ, ఫౌండేషన్ పట్ల ప్రేమ, అమ్మగారు అంటే ఆరాధన,నిరంతరము ఫౌండేషన్ వర్క్ మాత్రమే చెయ్యగల ఆర్థిక స్థోమత మాత్రము సరిపోవు…మరి?!ఆవిడ గారి శిక్షణ,ఆధ్యాత్మిక ప్రయాణము,అనుభవాలు ఇవి మాత్రమే కాక ఆమె పూర్వ జన్మలలో చేసిన ” ఎనర్జీ వర్క్” కూడా గురువుల చేత సింహావలోకనము చెయ్యబడుతుంది.
సుషుమ్న క్రియా యోగము నా జీవితములోకి తొంగి చూసే ముందు నేను ఎలా ఉండేదాన్ని?! భక్తి ,ఆధ్యాత్మికత ,ఆత్మ జ్ఞానం – ఇవన్నీ ఒకదాని తరవాత ఒకటి ఏర్పడతాయా? అన్న విషయాల్లో పరిజ్ఞానము నాకు చాలా తక్కువ… చిన్నప్పుడు ఉండే భక్తి తక్కువై ప్రాపంచిక సుఖాలు, వస్తువుల మీద భ్రాంతి, ఎమ్ సెట్ వస్తే 108 ప్రదక్షణాలు, ఇంజనీరింగ్ వస్తే 108 ప్రదక్షిణాలు ,మంచి సంబంధము వస్తే సచ్చరిత్ర పారాయణ – ఇలా బాబాగారు తన మొక్కులకే సంతోషిస్తారు అన్న అమాయకత్వంతో ఉండేవారు శిరీష.అమెరికా వెళ్లి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,విపరీతమైన డాలర్ల
సంపాదన ,ఇండియా వస్తే డాలర్లు పోతాయని నాలుగు సంవత్సరాలు ఇండియా ముఖం చూడని ఈమెలో ఇంత అద్భుతైన మార్పు అవసరము గురువులు ఎలా కల్పించారు?!ఎందుకు ఈమె “choosen few ” అయ్యారు?!
కర్మానుభవముతో ,బాధతో ఒక ఆత్మకు ఉద్ధారణ ఇవ్వగలిగేది గురువులు ఒక్కరే …అప్పటి దాకా అనుకున్నవి సాధిస్తూ, గాలిలో స్వేచ్ఛగా పక్షిలా విహరిస్తున్న శిరీష గారు ఆమె భాషలో బాబు పుట్టడంతో భూమి మీద జారి పడ్డాను….బాబు సరిగా తినకపోవడము, నిద్రలేమి వీటివల్ల విసుగు కోపము , బాబు ఆరోగ్యము పట్ల మధన.ఆమె దగ్గర తప్ప ఎవ్వరి దగ్గరా ఇమడక పోవడము,ఆమె ఉద్యోగ స్వాతంత్ర్యము కూడా లేకుండా పోవడము – ఆమె ఆరోగ్యము, తిండి,నిద్ర బాధింపబడడము – మొత్తము జీవితము తలకిందులైనది అనిపించి రకరకాల మెడిటేషన్ లు, యోగాలు, ప్రాణాయామ టెక్నిక్లు, రేకీ వంటి హీలింగ్ లు – ఏమీ ఆమెకు దారి చూపలేదు కానీ ,గురువుల దయ వలన 2011 లో ఒక కజిన్ ద్వారా ఈమె సుషుమ్న క్రియా యోగంలోకి ప్రవేశించారు… ప్రతి విషయాన్ని తరిచి అంతు చూసి సోధించి సాధించే తత్వం వలన – క్రియా యోగానికి ఉన్న కొన్ని వేల సంవత్సరాల చరిత్ర , సిద్ధ సాంప్రదాయము, కాయకల్ప చికిత్స, శ్రీ భోగనాథ సిద్ధుల అద్భుత సిద్ధులు – ఇవన్నీ విన్న ఆమెకు, స్వయంగా అనుభవము అయిన మనః శాంతి,బాబులో పాజిటివ్ గా జరిగే మార్పులు – ఆమెకు ఈ సుషుమ్న క్రియా యోగం పట్ల విపరీతమైన ఇష్టాన్ని గౌరవాన్ని పెంచాయి…గొప్ప ఉద్యోగము,మనసుపడి కట్టుకున్న చాలా ఖరీదైన కళాత్మకమైన ఇల్లు,స్టేటస్ అన్నీ వదిలి ఇండియాకు వచ్చి స్థిరపడి పోయె అద్భుత దృఢత్వము ఆమెకు ఆశీర్వచనాలుగా ఏర్పడ్డాయి.ప్రతి క్షణం ఇబ్బంది పెట్టే బాబు ఇండియాలో మూడు నెలల ట్రిప్ లో మామూలుగా ఉండడము.అమ్మగారి దర్శనము,ఆలోచనలు రాకుండా ఓంకార నాదం చెయ్యమని అమ్మగారి ఆశీర్వచనము ,ధ్యానము మొదలు పెట్టగానే ఆజ్ఞా చక్రంలో వెలుగులో ఒక ఋషి కాషాయ వస్త్రాలతో దర్శనమివ్వడము – శిరీషా! వారికి 300 సంవత్సరాలు నీకు ఆయన ” one of the guiding masters” అని అమ్మగారు చెప్పగానే పులకించి పోయారు శిరీష – ఆమె ప్రాపంచిక సుఖాల జీవితంలో ఇటువంటి అనుభవము ఆమెకు అద్భుతంగా అనిపించింది.
మన ఈ మెడిటేషన్ వర్క్ కోసము 180 మంది ప్రైమరీ సపోర్టర్స్ ,360 మంది సెకండరీ సపోర్టర్స్ జన్మ తీసుకుని సిద్ధంగా ఉన్నారు – ఆ 180 మందిలో తాను ఒకరు – అని తెలిసిన శిరీష గారి అదృష్టం,గురువు అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమైంది.మాటలు తడబడతాయేమోనన్న భయం ఉండే ఆమె అద్భుతంగా క్లాసులు నిర్వహించడము,అనుభవాలు అనర్గళంగా చెప్పగలిగే స్థితికి వచ్చారు.శ్రీ భోగనాథ సిద్ధులు చేసే ఓంకార నాదము వినే స్థితి శిరీషగారికి కలిగింది.
అరుణాచలములో లోకంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనము హంసలాగా పాలు తీసుకుని ,నీటిని వదిలేసినట్లు మంచిని మాత్రమే తీసుకోవాలి – ప్రాక్టికల్ గా ఉండండి – సెడెంటరి వరల్డ్ – ఎదో గడిచిపోతుంది అన్నట్లు ఉండవద్దు – సుఖాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ,కష్టాన్ని కూడా అట్లాగే గ్రహించడం ప్రారంభించండి – అన్న అమ్మగారి వాక్యాలు మంత్రాలుగా పనిచేశాయి ఆమెకు.
మనకు మెడిటేషన్ లో వచ్చే కలలు ,విజన్స్ అవన్నీ నిజాలు కావు.మన సబ్ కాన్షియస్ మన మీద ఉపయోగించే ట్రిక్ ,మనకు వచ్చిన ఏ మెసేజ్ అయినా ,అనుభవము అయినా అది అమ్మగారు అవును అంటేనే నిజం – ఈ సత్యాన్ని ఆవిడ గ్రహించారు.
కర్మ వశాత్తు కష్టం వచ్చినప్పుడు ఎలాగూ బాధ పడతాము…బోలెడంత ఎనర్జీ పోగొట్టుకుంటాము – కానీ ,ఆ కష్టాన్ని పదే పదే తలుచుకుని మాట్లాడుకుని పదే పదే ఎనర్జీ పోగొట్టుకోవడం ఎందుకు?! అందుకని డిస్కషన్ వద్దు.
ఇవన్నీ అమ్మగారి అధ్బుతమైన సూచనలు – అందుకే ఏ కష్టమైనా ,నష్టమైనా గురువులు ఇస్తే అది మన కర్మ క్షయానికే – మనను వాళ్లు ఇబ్బంది పడకుండా కాపాడతారు.
నువ్వు ప్యూర్ గా ఉన్నావు – అని అమ్మ గారి చేత రెండు సార్లు ఆశీర్వచనము పొందారు శిరీష గారు.
బాబాజీ గారు ఎక్కడికైతే వస్తారో అక్కడ చాలా పవర్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది.49నిమిషాల 49 రోజుల ధ్యానంతో ఏ సత్ సంకల్పము అయినా నెరవేరుతుంది – అమ్మగారి అమృత తుల్యమైన ఈ మాటలు సుషుమ్న క్రియా యోగులకు శిరోధార్యాలు అంటారు శిరీష గారు.
విష్వకార్యము 18 మంది సిద్ధులు 144 వ కుంభమేళా టైంలో ఈ అతిరుద్ర యాగం ప్లాన్ చేశారు – కుంభమేళా గురువులంతా సూక్ష్మ రూపంలో ఈ యాగానికి వస్తారు.వారు వర్షించే ఎనర్జీ మీరు ఎంత తీసుకోగలరో అంతే ప్రాప్తం – అన్న అమ్మగారి వాక్యాలు అర్థం చేసుకుని అక్కడ దాదాపు 12,000 మందికి సుషుమ్న క్రియా యోగము నేర్పించారు శిరీషగారు ఎన్నో కష్టనష్టాలు గురువుల దయవల్ల ఓర్చుకోగలిగారు. శ్రీ బాబాజీ గారు తృప్తి పడి శిరీష గారికి ఒక సాలిగ్రామం కానుకగా ఇచ్చి దీవించారు.
ఇట్లా ఎన్నో అద్భుతమైన అనుభవాలు శిరీషగారివి వీరి కుటుంబము అంతా సుషుమ్న క్రియా యోగులే
సుషుమ్న క్రియా యోగుల చాలా రకాల ప్రశ్నలకు శిరీష గారు ఒక గొప్ప సమాధానము.

Share.

Comments are closed.