Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి week 2

0

రెండవ వారం

గత వారం మేము అందించిన నియామావళిని మానకుండా చేశారు కదా. ఇదే ఉత్సాహంతో రెండవ  వారం కూడా విజయవంతంగా పూర్తి చేయండి.

శరీరం: స్థూల శరీర శుద్ధి కోసం సూర్య ప్రణామం.

సూక్ష్మ శరీర శుద్ధి కోసం  యాలుక, దాల్చిన చెక్క, జామ ఆకు, అల్లం, ధనియాలు

మనసు: ఓం కారాలు, దీర్ఘ శ్వాసలు.

ఆత్మ: ఆత్మ శక్తికి, జ్ఞాన వికాసానికి 21 లేదా  49 నిమిషాల సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

జామ :

పంటి నొప్పి, జుట్టు రాలటం, నిద్రలేమి, రక్త ప్రసరణకు ఎంతగానో ఉపకరిస్తుంది జామ ఆకు. అలాగే చర్మాన్ని మృదువుగా చేయగల ఔషధ గుణాలు ఉన్న ఆకు ఇది. జామ ఆకులో అధిక శాతం నీటిని నిల్వ చేసుకొనే లక్షణం ఉంటుందిట.

అల్లం:

కండరాలలో నొప్పిని నియంత్రించే శక్తి అల్లంలో ఉంటుంది. ప్రయాణాల్లో వికారం, ఉదయం లేచిన వెంటనే నిరుత్సాహంగా ఉండటం వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది అల్లం. ఆడవారిలో రుతు క్రమానికి సంబంధించిన సమస్యలకు దివ్యంగా ఉపయోగపడుతుంది అల్లం.

ఓంకారం

ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

శ్వాస

శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

సూర్య నమస్కారాలు

సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

ధనియాలు:

ధనియాల అధికంగా వంటల్లో వినియోగించటం అందరికి అలవాటే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చిన్ని గింజలు వంటకు ఘుమఘుమలను తెస్తాయి. కళ్ళు ఎర్రబడటం అనే సమస్యకు బాగా పనిచేస్తాయి ధనియాలు.

 దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క ఔషధ గుణాల ద్వారా దేహంలో నాడీమండల కూడళ్లలో ఏర్పడే ఆటంకాల వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల కలిగే శరీర దుర్వాసనను దూరం చేసే లక్షణాలు ఉన్నాయి. శరీరం, మనసు, ఆత్మ సంయోగం ద్వారా ధ్యానంలో తొందరగా లయం కావచ్చు. ధ్యానం ద్వారా మృత కణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి దేహం నుంచి సుగంధం ఉత్పన్నం అయ్యేలా కూడా చెయ్యవచ్చు.

అభద్రతా భావం” గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

ఇతరులతో పోలిక వదిలిపెట్టడం” గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

Share.

Comments are closed.