Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి 4 వ వారం

0

నాల్గవ వారం

ఎంతో అద్భుతంగా నాలుగు వారాల పాటు యోగ శుద్ధి ద్వారా లభించే పరిపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేశారు. ఈ ప్రక్రియ వల్ల మీరు మునపటి కంటే అధికమైన శక్తితో రోజును వెళ్లదీస్తున్నారా?
ఈ ప్రక్రియ ద్వారా మీరు ఇప్పటి వరకు పొందిన లాభాలను గురించి మాకు రాసి పంపండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏ స్థాయిలో మీలో జరుగుతోందో మాతో పంచుకోండి!

ఈ వారం యోగ శుద్ధికి కావాల్సిన పదార్థాలు
దూర్వ గడ్డి
బిల్వ పత్రం
నిమ్మ రసం
జీల కర్ర

శరీరం: సూర్య నమస్కారాలు
నీటిలో మేము సూచించిన విధంగా పదార్థాలు మరిగించి తాగటం.

మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

దూర్వ

గరికను దూర్వ అని కూడా అంటారు. వినాయకుడికి చవితి నాడు చేసే పూజలో గరికను వినియోగిస్తారు.
ప్రతి బుధవారం వినాయకుడికి జరిపించే విశేషమైన పూజాధికాల్లో సైతం దీన్ని వాడతారు. దీన్ని స్వీకరించటం వల్ల కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు పుష్కలంగా శరీరానికి అందుతాయి. కొవ్వును దూరం చేసే 7 పదార్థాల్లో  దూర్వ ప్రత్యేకమైనది.

నిమ్మరసం
దాహార్తిని తీర్చి వేడిమి నుంచి హాయిని కలిగిస్తుంది నిమ్మరసం. విశుద్ధ, అనాహత చక్రాలలో  కలిగే దోషాలను నివారించగలదు. గుండెలో, గొంతులో పేరుకున్న కఫాన్ని, నోటికి సంబంధించిన ఆరోగ్యానికి అవసరమైంది నిమ్మరసం. చర్మంలో లోపించిన ఛాయను తిరిగి పొందేందుకు నిమ్మరసం మంచిది. ఉపవాస సమయాలలో నిమ్మరసాన్ని తీసుకోవటం అందరికి తెలిసిందే. గోరువెచ్చని నీటిలో తేనే నిమ్మరసం ఊబ కాయాన్ని, శరీర బరువును నియత్రించగలదు. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించగలదు.

ఓంకారం
ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యానసాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

శ్వాస
శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

సూర్య నమస్కారాలు
సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

 

బిల్వ పత్రం
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భాసిల్లే బిల్వ పత్రం అత్యంత పవిత్రమైనది. పరమ శివుడి స్వరూపంగా కొలిచే ఈ బిల్వపత్రం, ఔషధ గుణాలతో పాటు శక్తి శరీరంలో మార్పులు కలగటానికి కారణం అవుతుంది. భగవత్ జ్ఞానం కలిగించే ఆజ్ఞ చక్రాన్ని సూచించే ఈ దళం శ్వాస లో కలిగే ఇబ్బందులను, దోషాలను నివారించగలదు. బిల్వ పత్రం వళ్ళ వాంతులు, కడుపు ఉబ్బరం, వంటి ఇబ్బందులను కూడా దూరం చేసుకోవచ్చు

జీలకర్ర
జీలకర్రను భారతీయులతో పాటుగా ఈజిప్శీయులు కూడా అనేక రకాల ఆధ్యాత్మిక సాధనల కోసం వినియోగించేవారని ప్రతీతి. జీలకర్ర ప్రస్థావన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా మనకు దర్శనమిస్తుంది. రక్తాన్ని పరిశుభ్ర పరచటంలో, ఆరోగ్యమైన కణ ఉత్పత్తి జరగటానికి దోహదం చేస్తుంది జీలకర్ర. తరతరాలుగా మనం వినియోగిస్తున్న జీలకర్ర మహత్యం ఎరిగి జీలకర్ర వంటి దివ్య ఔషధాన్ని నీటిలో మరిగించి స్వీకరిద్దాం

ఇతరులతో పోలిక వదిలిపెట్టడం” గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

‘అనుకున్నది జరుగుతుందో జరగదో అన్న బెంగను విడిచిపెట్టడం’ గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

Share.

Comments are closed.