Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి 6వ వారం

0

ఇంతే దీక్షతో మరో రెండు వారాల పాటు మేము చెప్పిన రీతిలో ప్రక్రియలను చేయండి
ఈ వారానికి కావాల్సిన పదార్ధాలు

వాము
తులసి
కరివేపాకు
ఉసిరి

శరీరం:
సూర్య నమస్కారాలు,
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగించి తాగటం.

మనసు:
మానసిక శుద్ధి కోసం ఓంకారాలు /దీర్ఘ శ్వాసలు
జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తతను తొలగించటం అన్నది జీవితానికి అన్వయించు కోవటం.

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

ఉసిరిలో ఎంతో అద్భుతమైన ఔషధ గుణాలే కాదు ఆధ్యాత్మిక ప్రగతికి కూడా ఇది వినియోగించబడింది. ఉసిరిని దానం చేయటం వల్ల ఆది శంకరులు కనకధారను ఆశువుగా పలికి బంగారు ఉసిరికాయల్ని కురిపించిన వృత్తాంతం అందిరికీ తెలుసు. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల జీర్ణ శక్తి పెరగటం, కొవ్వు తగ్గటం, కాలేయం మెరుగ్గా పనిచేయటం జరుగుతుంది.

కరివేపాకు:
భారత దేశంలో ప్రతి మూల విరివిగా వినియోగించే మహత్తర ఔషధ గుణాలున్న కరివేపాకును పూజ విధానాల్లో కూడా తులసి ఆకు అందుబాటులో లేని పక్షంలో వినియోగిస్తారు. బలమైన కేశాలు కోసం కర్వేపాకు చాలా మంచిది. మధుమేహం, హానికారక కొవ్వును కూడా నివారించగల అద్భుత గుణాలున్న కర్వేపాకు ఆకు ఎంతో మేలు చేస్తుంది.ఓంకారం

ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

 

 

 

 

శ్వాస

శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

సూర్య నమస్కారాలు

సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

తులసి
పరమగురువులైన శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి గౌరి శంకర్ పీఠం లో సైతం దర్శనమిచ్చే పవిత్రమైన మొక్క తులసి. తులసిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలు కలిగించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్లే తులసి ఆకులను దేవాలయాల్లో కూడా తీర్థంగా ఇస్తారు. విషపూరితమైన గాలిని కూడా శుద్ధంగా మారుస్తుంది తులసి. తులసి ఆకులను ప్రకృతి మాత అందించిన దివ్య ఔషధంగా భావించి ఈ ఆకులను మరిగించి స్వీకరించండి.

వాము
ఉదరంలో నులి పురుగులు, వికారం వంటి సమస్యలను తొలగించి జీర్ణాశయానికి బలాన్ని ఇస్తుంది వాము. పూర్వం ఎన్నో రకాల రోగాల నివారణ కోసం వామును వాడేవారు. వాము చిన్నపిల్లలకు ఒక ముద్దలో నేతితో తినిపిస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. బాగా బలహీనంగా ఉన్న వారు వామును తీసుకోవటం ద్వారా పౌష్టిక ఆహారాన్ని తీసుకొనే జీర్ణ క్రియ పెరిగి బలం పుంజుకుంటారు.

 

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

Share.

Comments are closed.