హేమలత చింతలపాటి అనుభవాలు

0

సుషుమ్న క్రియా యోగములో అత్యంత నిష్ణాతులైన విజయలక్ష్మిగారి అమ్మాయి హేమలతగారు…కుటుంబము అంతా సుషుమ్న క్రియా యోగ ప్రక్రియలో నిష్ణాతులైతే ఎంత ఆధ్యాత్మిక సౌరభాలు కుటుంబం చుట్టూ ఆవరిస్తాయో, శాంతి,ఆనందము ఎంత అనుభవంలోకి వస్తాయో వీరి కుటుంబాన్ని చూసి గ్రహించవచ్చును.
2007లో అమెరికాలో భగవద్గీత, ఉపనిషత్తుల ద్వారా భ్రూమధ్య ధ్యానము చాలా శక్తివంతమైనది అని గ్రహించి ఒక యోగి ఆత్మ కథ చదివి – ఈ యోగాన్ని గురువు ద్వారా నేర్చుకోవాలి అన్న ఆమె తపనకు 2010లో సాక్షాత్తు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి ద్వారానే ఈ సుషుమ్న క్రియా యోగం ఉపదేశంగా తీసుకోగలిగారు హేమలతగారు… అప్పుడు జరిగిన అద్భుతం – ఆమెకు స్వయంగా అమ్మగారి చేతుల మీదుగా పరమగురువుల ఫోటో ఇచ్చి పంపారు…అది ఎంత గొప్ప ఎనర్జీ ట్రాన్స్ఫరెన్స్ అంటే… ఆమెకు తన ఇంట్లో పరమగురువులైన భోగనాథ మహర్షి గారు,బాబాజీగారు నడయాడుతున్నట్లు అడుగుల సవ్వడి వినగలిగేవారు… అంతేకాదు, బాబాజీగారి సద్దర్శనము అయింది…హేమలతగారి మాతృమూర్తి విజయలక్ష్మిగారికి జరగబోయే కుండలిని ఆక్టివేషన్ ప్రాసెస్ ఆత్మసాక్షాత్కార స్థితిని ముందుగా చూపించారు గురువులు. అంతేకాదు.. 10 సంవత్సరాలుగా మైగ్రేన్ తలనొప్పి ఉండేది హేమలత గారికి ధ్యానంలో గురువులు అనుగ్రహించిన ఆపిల్ తినగానే హీలింగ్ ప్రాసెస్ మొదలు అయినది. అమ్మగారు ఒక నెలరోజుల దాకా ఈ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు అంతే.. అంత భయంకరమైన తలనొప్పి తగ్గిపోయింది హేమలతగారికి. ఆ అద్భుతం తరవాత ఆఫీసు పని, ఇంటిపని ఏమాత్రము శ్రమలేకుండా చాలా సమన్వయంతో చేసేవారు ఆమె. 2011 నుంచి అమెరికాలో క్లాసులు నిర్వహించే అవకాశము, ధ్యానము చేసిన ప్రతి ఒక్కరిలో ఉత్సాహము, ఆరోగ్యము వగైరా పాజిటివ్ మార్పులు జరుగుతూ ఉండేవి. అంతేకాదు, అమ్మగారి అనుగ్రహం వలన నేను “నాలో అనన్య భావాన్ని” అనుభవించడం, నా ఆస్ట్రల్ బాడీని విడిగా చూసుకోవడము, ఎనర్జీ లెవల్స్ పెరగడం గమనించాను అంటారామె.వీరి పెద్ద పాప రేమా శ్రావణి 2012లో గురు పౌర్ణమిలో కైలాస దేవతా దర్శనం చేసింది.మంచుగుహల్లో వినాయకచవితి నాడు అమ్మగారితో శ్రీ వినాయకుల వారు కూడా ధ్యానం చెయ్యడం చూశారు. వెండి పళ్లెములో గుడిలో మూడు ఎనర్జీ బాల్స్ నుంచి ముగ్గురు గురువులు శ్రీ భోగనాథ మహర్షులు, శ్రీ బాబాజీ గారు,శ్రీ ఆత్మానందమయి అమ్మగారు ఉద్భవించగా, వీరు ముగ్గురు భూమి మీద సుషుమ్న క్రియా యోగ ధ్యానం నేర్పిస్తారు అని సర్వేశ్వరుడు ఉచ్ఛరించిన అనాహత శబ్దాన్ని విన్నారు…హేమలతగారి చిన్న పాప హీరా శ్రావణికి ధ్యానములో భగవద్గీత వినిపించడము,గురువుల దర్శనము,అమ్మగారు సుషుమ్న క్రియా యోగ ప్రాప్తికి భూమి మీద ఉండడము షార్ట్ వీడియోలాగా కనిపించింది. ఒక రోజు ధ్యానంలో ఆకాశములో నక్షత్రాలు అన్నీ యోగముద్రగా రూపుదాల్చాయి…ఆ నక్షత్రాలలో చిన్న చిన్న దేవతలు దర్శనమిచ్చారు.
కుటుంబమంతా సుషుమ్న క్రియా యోగ విద్యలో నిష్ణాతులై,ఆత్మసాక్షాత్కార సిద్ది మార్గంలో ఉన్నప్పుడు – వారి జీవితాలు ఎంత విలువైనవో, ఎంత అధ్బుతమైన అనుభవాలు పొందుతారో అన్న విషయానికి శ్రీమతి విజయలక్ష్మిగారి కుటుంబమే సాక్షము.

Share.

About Author

Comments are closed.