Welcome to the BLISSFUL journey

యశస్విని అనుభవాలు

0

యశస్విని ముంబైలో ఉండేవారు,వీరు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.తను ఎంతో భావంతో సంపూర్ణ విశ్వాసంతో సుషుమ్న క్రియా యోగ సాధన చేసుకుంటారు.2012 గురుపూజ మహోత్సవానికి కొన్ని రోజుల ముందు తనకు విపరీతమైన చెవినొప్పి వచ్చింది చాలామంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది. గురుపూజ దగ్గర పడుతోంది కానీ నొప్పి తగ్గటం లేదు ఆ సంవత్సరం గురు పూజని శృంగేరిలో జరుపుకుంటున్నాము ఆ ప్రదేశంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయి అలానే చలి కూడా ఎక్కువే ఇటువంటి పరిస్థితిలో తను ఈ నొప్పితో అక్కడకు వస్తే తన పరిస్థితి మరీ విషమిస్తుందేమో అని భయపడుతూ…కానీ రాకపోతే ఆ సంవత్సరం గురు పూజ చేసుకునే భాగ్యాన్ని కోల్పోతాను అని మధన పడుతూ గురువుల్ని వేడుకుంది సడన్ గా నొప్పి తగ్గిపోయింది ఏ ఆటంకము లేకుండా గురుపూజ మహోత్సవంలో పాల్గొని గురుమాత ఆశీస్సులతో తిరిగి ముంబై చేరింది. ముంబై చేరుకోగానే మళ్లీ చెవి నొప్పి తిరగబెట్టింది అయితే ఇన్ని రోజులు ప్రాబ్లం ఏమిటో తెలుసుకోలేని డాక్టర్స్ కి ఈసారి మాత్రము తన ప్రాబ్లంని డయగ్నోస్ చేయగలిగారు. వారు తను కొలిస్టిటోమా అనే చెవి ప్రాబ్లంతో బాధపడుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు కొలిస్టిటోమా అంటే చెవి లోపలి భాగంలో చీము పట్టడం. మన చెవి లోపల భాగం అంటే దానిని ఇన్నర్ ఇయర్ అంటాము. ఈ ఇన్నర్ ఇయర్ డైరెక్ట్ గా మెదడులోనే ఉంటుంది అన్ని పరీక్షలు చేసి యశస్వినీకి ఇన్ఫెక్షన్ తన మెదడు నుంచి కేవలం వెంట్రుక వాసి దూరంలోనే ఆగిపోయింది అని చెప్పారు. ఇమీడియెట్ గా సర్జరీ చేసి చీము తొలగించుకోవాలి అని చెప్పారు.
ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి చెవిలో చీము అనేది రాత్రికి రాత్రే ఏర్పడి మెదడు దగ్గర దాకా చేరదండి. తనకి ఈ ప్రాబ్లం చాలా రోజులుగా బహుశా సంవత్సరాలుగా కూడా ఉండే ఉంటుంది కానీ డాక్టర్స్ తెలుసుకోలేకపోవడం వలన టైంకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రోగం ముదిరి ఇంచుమించు మెదడు దాకా పాకింది…. మరి తను ఉండేది ఏ పల్లెటూరు కాదు ముంబై మహా నగరం అయినా డయాగ్నోసిస్ చాలా లేట్ అయింది. ఎప్పుడైతే తను తన వేదనని గురుమాత ఆత్మానందమయి అమ్మగారి దృష్టికి తెచ్చిందో వెంటనే డాక్టర్స్ కి తన ప్రాబ్లం ఏమిటో తెలిసిపోయింది ఇది అండి మన గురుమాత కరుణకి, దివ్య లీలలకి ఒక ఉదాహరణ. అమ్మగారికి చెప్పి పర్మిషన్ తీసుకుని ఆశీస్సులు తీసుకుని ఆపరేషన్ చేయించుకుంది ఆపరేషన్ జయప్రదంగా ముగిసింది. చెవి లోపల భాగంలో ఇంచుమించు మెదడుని తాకే వరకు ఆపరేషన్ చేశారు కానీ యశస్వినీకి ఎటువంటి నొప్పి తెలియలేదు ఎనస్తీషియా ఎఫెక్ట్ అయిపోయిన తరవాత కూడా తనకు ఎటువంటి నొప్పి కానీ బాధ కాని తెలియలేదు గురువుల అద్భుత లీల వారి ప్రేమ వాత్సల్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి మనకి?!

Share.

Comments are closed.