Day 16 – అమ్మగారు చూపిన మా మాతృ వృక్షం

0

అమ్మగారు మమ్మల్ని మౌనంగా ఉంటూ, ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు వద్దకు వెళ్లి, ఆ చెట్టును మా కర్మలు తీసుకొమ్మని ప్రార్థిస్తున్నట్లు భావన చేస్తూ, చెట్టుకు భ్రూ మధ్యo తాకిస్తూ ఉండమన్నారు. ఆ విధంగా మేము చేసినప్పుడు భ్రూ మధ్యంలో చాలా శక్తి ప్రకంపనలు కలిగాయి. అందరం ఒక్కొక్క చెట్టు వద్దకు వెళ్ళాం.కానీ నాగ తేజ మాత్రం తనకు సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వేరొకరిని పంపి, చెట్లన్నిటి వద్ద అందరూ ఉండటంతో మౌనంగా ఉండిపోయారు. ఇది గమనించిన అమ్మగారు సమీపంలోని ఒక చెట్టు వద్దకు వెళ్లమంటూ నాగతేజాకు సైగ చేశారట. అయితే అప్పటికే అక్కడ ఇంకొకరు ఉన్నారు, కానీ అమ్మగారు చెప్పటంతో ఆ చెట్టు వద్దే ప్రక్రియ ఆరంభించారు నాగ తేజ. అందరం 5 నిమిషాల నుండి 10 నిమిషాల పాటు చెట్టును పట్టుకొని ఒక విధమైన స్థితిలో ఉండిపోయాం. ప్రక్రియ పూర్తయి యథా స్థితికి వచ్చిన మాకు నాగ తేజ ఏడుస్తూ కనిపించారు. వారికి ప్రత్యేకంగా చెట్టు లభించలేదని బాధ పడుతున్నారని కొందరం అనుకున్నాం. కానీ వారి భావోద్వేగానికి కారణమేంటో చెప్ప సాగారు తేజ.

Share.

Leave A Reply